అంతర్జాతీయ యోగా దినోత్సవం
సందర్భంగా ఏపీ ఆయుష్ శాఖ పిల్లలకు యోగాసన పోటీల నిర్వహణ – వివరాలు ఇవే
అంతర్జాతీయ యోగా దినోత్సవం
సందర్భంగా ఏపీ ఆయుష్ శాఖ ఈ నెల 21న 18 ఏళ్లలోపు పిల్లలకు యోగాసన పోటీలు
నిర్వహిస్తోంది. పోటీలో పాల్గొనే అభ్యర్థులకు 2021 జూన్ 1 నాటికి 18 ఏళ్లు వయసు
నిండి ఉండకూడదు. ఏపీ విద్యార్థులు మాత్రమే ఈ పోటీలకు అర్హులు. వర్చువల్ గా జరిగే ఈ
పోటీల్లో రెండు దశలు ఉంటాయి.
* పార్ట్-ఏలో గరుడాసనం, పశ్చి
మోత్తాసనం, హలాసనం, శీర్షాసనం ఉంటాయి.
* పార్ట్-బీలో పూర్ణ నటరాజ ఆసనం, బకాసన,
పూర్ణ సుప్త వజ్రాసనం, ధనురాసనం ఉంటాయి.
ఈ ఆసనాలను చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ ద్వారా గానీ, వీడియో కెమెరా ద్వారా గానీ రికార్డు చెయ్య వచ్చు. వీడియోలో మొదటగా విద్యార్థి పేరు, వయసు, తరగతి, స్కూలు/కాలేజీ, జిల్లా, కాంటాక్ట్ ఫోన్ నంబర్ పేర్కొనాలి. 4 ఆసనాలు 5 నిమిషాల వ్యవధికి మించి ఉండకూడదు. ప్రతి ఆసనంలో 20 సెకన్ల నుంచి 30 సెకన్లకు మించి ఉండకూడదు.
వీటిని ఈ నెల 16లోగా 2021yogacompetition@gmail.com కు పంపించాల్సి ఉంటుంది. ఈ నెల 21న ఫలితాలు ప్రకటించి విజేతలను నిర్ణయిస్తారు.
0 Komentar