APPSC: లాటరీ ద్వారా ఇంటర్వ్యూ బోర్డుల ఎంపిక - అభ్యర్థులే ఎంపిక చేసుకునే అవకాశం
గ్రూప్-1
మౌఖిక పరీక్షలను 2 బోర్డుల ద్వారా నిర్వహించే అవకాశాలు
కనిపిస్తున్నాయి. ఏపీపీఎస్సీ ఈ బోర్డులను ఖరారు చేస్తుంది. ఇంటర్వ్యూ చేసే
బోర్డును లాటరీ పద్ధతిలో అభ్యర్థులే ఎంపిక చేసుకునేలా నిర్ణయించారు. పరీక్ష
ప్రారంభానికి ముందు అభ్యర్థితో లాటరీలో చీటీ తీయిస్తారు. అభ్యర్థికి ఏ బోర్డు చీటీ
వస్తే అందులో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. బోర్డుల్లో సభ్యుల వివరాలు
అభ్యర్థులకు తెలియజేయరు. సభ్యులను కమిషన్ కార్యదర్శి ఖరారు చేస్తారు.
ప్రస్తుతం ఛైర్మన్‌తో కలిపి కమిషన్‌లో
10 మంది సభ్యులు ఉన్నారు. ప్రతి బోర్డులో ముగ్గురు సభ్యులతోపాటు ఒక సీనియర్
ఐఏఎస్/ఐపీఎస్ అధికారి, సబ్జెక్టు నిపుణుల కేటగిరీలో
సీనియర్ ప్రొఫెసర్/ఐటీ, సాఫ్ట్‌వేర్, ఇతర రంగాల్లో నిష్ణాతులైన వారిలో ఒకరిని సభ్యులుగా నియమిస్తారు. ముగ్గురు
సభ్యుల్లో సీనియర్‌ను ఛైర్మన్‌గా నియమిస్తారు. ఒక్కో బోర్డు ద్వారా ప్రతి రోజు పది
మందిని ఇంటర్వ్యూ చేస్తారు. 75 మార్కులకు జరిగే ఇంటర్వ్యూలో 68 మార్కులు దాటకుండా చూడాలని భావిస్తున్నారు.
ఇంటర్వ్యూలో అభ్యర్థుల ప్రతిభను
సభ్యుల ద్వారా తెలుసుకొని చివరిగా ఛైర్మన్ మార్కులు లేదా శ్రేణి కేటాయిస్తారు.
ఛైర్మన్ నిర్ణయంపై సభ్యులు సంతృప్తి చెందకుంటే అభ్యంతరం తెలుపొచ్చు. అప్పుడు
చర్చించి ఏకాభిప్రాయంతో ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. ఏపీపీఎస్సీ ప్రకటించిన
ప్రకారం కమిషన్ కార్యాలయంలో ఈ నెల 17 నుంచి వచ్చే నెల 7 వరకు మౌఖిక పరీక్షలు జరుగుతాయి.
0 Komentar