Banks offer higher rates on FDs to
encourage Covid-19 vaccination
వ్యాక్సిన్ వేసుకున్న వారికి
బ్యాంకుల ప్రత్యేక పథకాలు - వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించేందుకు ఆఫర్లు
కరోనాను కట్టడి చేయడం కోసం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అంతేకాదు.. వ్యాక్సిన్ వేసుకున్న వారికి ప్రోత్సాహకంగా పలు చోట్ల స్వచ్ఛంద సంస్థలు బహుమతులు కూడా ఇస్తున్నాయి. ఈ క్రమంలో బ్యాంకులు సైతం వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించేందుకు వినూత్న ఆఫర్లను తీసుకొస్తున్నాయి. వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ ఇస్తామని ప్రకటిస్తున్నాయి. అయితే, ఈ ఆఫర్లు కొద్ది రోజులకు మాత్రమే.
యూకోవ్యాక్సి-999
కనీసం ఒక్క డోసు కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నా ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై ప్రస్తుత వడ్డీరేటుపై 30 బేసిస్ పాయింట్లు లేదా 0.30 శాతం అదనంగా వడ్డీ ఇస్తామని యూకో బ్యాంక్ వెల్లడించింది. అయితే ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ కాల వ్యవధి 999 రోజులు మాత్రమే. సెప్టెంబర్ 30 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రోత్సహించడం కోసమే మేం ‘యూకో వ్యాక్సి-999’ పేరుతో ఈ ఆఫర్ తీసుకొచ్చామని యూకో బ్యాంక్ అధికారులు తెలిపారు.
ఇమ్యూన్ ఇండియా డిపాజిట్ స్కీమ్సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఏప్రిల్ నెలలోనే వ్యాక్సిన్ వేయించుకున్న వారి కోసం ప్రత్యేక పథకం
ప్రవేశపెట్టింది. ఇమ్యూన్ ఇండియా డిపాజిట్ స్కీమ్ ద్వారా ఎవరైతే వ్యాక్సిన్
వేయించుకుంటారో వారికి ప్రస్తుత వడ్డీరేటుపై అదనంగా 25
బేసిస్ పాయింట్లతో వడ్డీ చెల్లించనుంది. అయితే, ఈ ఫిక్స్‌డ్
డిపాజిట్ కాల వ్యవధి 1,111 రోజులు. వ్యాక్సిన్ వేసుకున్న
సీనియర్ సిటిజన్లకైతే అదనంగా మరో 25 బేసిస్ పాయింట్లు
కలిపి మొత్తం 50 బేసిస్ పాయింట్లు లేదా 0.50శాతం వడ్డీ ఇవ్వనుంది.
0 Komentar