Banks To Check If You Have Filed ITR When
Income Crosses TDS Limit from July 1, Levy 2x TDS If Not
Income Tax: 2 ఏళ్లుగా
రిటర్నులు దాఖలు చేయలేదా? - టీడీఎస్/టీసీఎస్ రూ.50,000 మించితే జూలై 1 నుంచి అధిక పన్ను
గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఆదాయ
మూలం వద్ద పన్ను చెల్లింపు (టీడీఎస్), మూలం వద్ద పన్ను వసూలు
(టీసీఎస్) రూపంలో రూ.50,000 మించి ఉన్నప్పటికీ.. ఆదాయపు
పన్ను రిటర్నులు దాఖలు చేయని వారి నుంచి అధిక శాతంలో పన్ను వసూలు చేయాలని ఆదాయపు
పన్ను విభాగం నిర్ణయించింది. వీరిని ‘ప్రత్యేక వ్యక్తులు’ (స్పెసిఫైడ్ పర్సన్స్)గా
గుర్తించేందుకు అవసరమైన ఒక యుటిలిటీని టీడీఎస్, టీసీఎస్
వసూలు చేసేవారికి అందుబాటులోకి తెచ్చింది.
గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో (FY 2018-19 and
2019-20) ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయని వారి వద్ద అధిక పన్ను
వసూలు చేయాలని 2021 బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో
జులై 1 నుంచి ఈ నిబంధనను అమల్లోకి తీసుకొస్తూ.. కేంద్ర
ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) సోమవారం సర్క్యులర్ జారీ చేసింది. టీడీఎస్, టీసీఎస్
చేసేవారు.. వ్యక్తుల శాశ్వత ఖాతా సంఖ్య (పాన్)ను నమోదు చేయగానే ఆ ‘పత్యేక వ్యక్తుల’కు
సంబంధించిన వివరాలు కనిపిస్తాయని సీబీడీటీ తెలిపింది. అప్పుడు ఆయా వ్యక్తులు అధిక
శాతం పన్ను చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.
CBDT issues Circular No. 11 of 2021 dt 21.06.2021 on implementation of section 206AB & 206CCA wrt higher tax deduction/collection for certain non-filers. New functionality issued for compliance checks for sec 206AB & 206CCA to ease compliance burden of tax deductors/collectors. pic.twitter.com/1DP39BKVZi
— Income Tax India (@IncomeTaxIndia) June 21, 2021
0 Komentar