Joker Software: జోకర్
యాప్స్‌తో జాగ్రత్త, ఓపెన్ చేశారా అంతే సంగతులు
సైబర్ నేరగాళ్లు జోకర్ పేరుతో మాలిషియస్ మాల్ వేర్‌ను ప్రవేశపెట్టి మోసాలకు పాల్పడే ప్రమాదముందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ హెచ్చరించారు. ముంబయిలో గత 3నెలలుగా ఈతరహా మోసాలు విపరీతంగా పెరిగాయని, వందల సంఖ్యలో యువత జోకర్ మాల్‌వేర్ వల్ల డబ్బులు కోల్పోయారని అంజనీకుమార్ తెలిపారు.అనుమానాస్పద లింకులు, గుర్తు తెలియని వ్యక్తులు పంపే సందేశాలు, లింకులను చూడొద్దని అంజనీకుమార్ తెలిపారు.
"జోకర్ మాలిషియస్
మాల్‌వేర్‌ను గూగుల్ సంస్థ బ్లాక్ చేసిందని, ప్లే స్టోర్
నుంచి పలు దఫాలుగా తొలగించినా.. సైబర్ నేరగాళ్లు వేర్వేరు పేర్లతో మాల్‌వేర్‌ను
ప్రవేశపెట్టి మోసాలకు పాల్పడుతున్నట్టు సీపీ వెల్లడించారు."
సైబర్ నేరగాళ్లు పెరిగిపోతున్నారు. మనకు తెలియకుండానే..అకౌంట్ల నుంచి డబ్బులు మాయమై పోతున్నాయి. ఏదో ఒక లింక్ పంపించి,అది క్లిక్ చేయాలని..గిఫ్ట్ లు, ఇతరత్రా విలువైన వస్తువులు వస్తాయని నమ్మబలికి మోసగొడుతున్నారు. తాజాగా..జోకర్ వైరస్ అందరినీ భయపెడుతోంది. ఈ మాల్ వేర్ బారిన పడిన యువత..తీవ్రంగా నష్టపోతోంది. గూగుల్ ఐదుసార్లు డిలీట్ చేసినా..మెట్రో నగరాలను ఇప్పటికే తీవ్రంగా కుదిపేస్తోంది.
మొబైల్స్, డెస్క్‌టాప్‌లో
ఇది ప్రత్యక్షమవుతోంది. పొరపాటున జోకర్ ఓపెన్ చేసినట్లయితే సైబర్ నేరగాళ్ల చేతిలో
మోసపోవాల్సిందేనని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. దీని ద్వారా వ్యక్తిగత
సమాచారం మోసగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుందని హెచ్చరించారు. బ్యాంకు వివరాల నుంచి
వ్యక్తిగత ఫోటోల వరకు మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తాయని అన్నారు. జోకర్‌ను
ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయరాదని సీపీ అంజనీ కుమార్ సూచించారు.
0 Komentar