CBSE Board Exams: Education Minister to
Interact with Students Today
సిబిఎస్‌ఇ బోర్డు పరీక్షలు: ఈ రోజు విద్యార్థులతో విద్యా మంత్రి రమేశ్ పోఖియాల్ సోషల్ మీడియా ద్వారా ముఖాముఖి
★ కేంద్ర విద్యాశాఖమంత్రి రమేశ్ పోఖియాల్
నిశాంక్ శుక్రవారం విద్యార్థులతో సోషల్ మీడియా ద్వారా ముఖాముఖి సమావేశం
కానున్నారు. పది, 12వ తరగతులకు సంబంధించి విద్యార్థుల
ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతారు.
★ కరోనా మహమ్మారి కారణంగా చాలా రాష్ట్రాలు
పరీక్షలు రద్దు చేయడంతో విద్యార్థుల్లో చాలా అనుమానాలు, ప్రశ్నలు
తలెత్తుతున్నాయి. వాటిని నివృత్తి చేయడానికి కేంద్రమంత్రి విద్యార్థులతో
ముఖాముఖికి అంగీకరించారు.
★ అనేక ప్రశ్నలు, సందేహాలతో
విద్యార్థులు తనకు మెసేజ్ లు పెడుతున్నారని నిశాంక్ తెలిపారు.
★' ప్రియమైన విద్యార్థులారా ! మీ నుంచి నాకు
చాలా మెసేజ్ లు, సమాచారం అందింది. నా ఆర్యోగం గురించి కూడా
ఆందోళనలు వ్యక్తంచేశారు.
★ ఇందుకుగాను మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.
నేను ఇప్పుడు ఆరోగ్యవంతంగా ఉన్నాను ' అని నిశాంక్ చెప్పారు.
I will be interacting with dear students tomorrow at 4 PM to discuss their concerns & queries related to evaluation of CBSE board exams. If you have any doubts or suggestions, you may share them through Twitter or Facebook by the afternoon of June 25th pic.twitter.com/SIkXitnIRl
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) June 24, 2021
0 Komentar