CBSE, ICSE Cancels Class XII Board Exams
సీబీఎస్‌ఈ, ఐసిఎస్‌ఈ
12వ తరగతి పరీక్షలు రద్దు
కరోనా వైరస్ విజృంభణతో దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్‌ఈ బోర్డు 12వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అద్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల కంటే విద్యార్థుల ఆరోగ్యం, భద్రతే తమకు ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఒత్తిడితో కూడిన ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులను పరీక్ష రాసేందుకు బలవంతం చేయకూడదని ప్రధాని సూచించారు. పరీక్షలు రాయాలనుకునే వారికి కరోనా ఉద్ధృతి తగ్గాక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. గతేడాది మాదిరిగానే ఆసక్తి ఉన్నవారికి పరీక్షలు నిర్వహించనున్నారు. సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలను కూడా గతంలో రద్దు చేసిన విషయం తెలిసిందే.
విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో
ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రధాని తెలిపారు. సాయంత్రం 5.30గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో పరీక్షల
నిర్వహణపైనే చర్చించారు. ఈ పరీక్షలకు సంబంధించి రాష్ట్రాల నుంచి సేకరించిన
నివేదికలు, అభిప్రాయాలను అధికారులు ప్రధానికి వివరించారు. ఈ
సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత
విషయంలో రాజీపడే ప్రస్తేలేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరీక్షలు మన యువతను
ప్రమాదంలోకి నెట్టేందుకు కారణం కారాదని పేర్కొన్నారు.
ఐసీఎస్ఈ కూడా..
దేశంలో కోవిడ్ మహమ్మారి తీవ్రతను దృష్టిలో
ఉంచుకుని,
ఐసీఎస్ఈ (ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) ఈ ఏడాది 12వ తరగతి బోర్డ్ పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయించింది. విద్యార్థుల
ప్రతిభను అంచనా వేసే ప్రత్యామ్నాయ విధానాలను ప్రకటిస్తామని ఐసీఎస్ఈ సెక్రటరీ
గెర్రీ చెప్పారు. ప్రధాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీబీఎస్ఈ పరీక్షలను రద్దు
చేయాలని నిర్ణయించడంతో ఐసీఎస్ఈ ఈ మేరకు ప్రకటించారు.
0 Komentar