CBSE To Announce Class 12 Results by
July 31; Here's How Score Will Be Calculated
జులై 31నాటికి
సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు - మార్కుల
ప్రణాళిక ఇదే - సుప్రీంకు వెల్లడించిన కేంద్రం
12వ తరగతి మార్కుల నిర్థారణ
విధానాన్ని సీబీఎస్‌ఈ గురువారం ప్రకటించింది. 10,11వ తరగతి
మార్కుల ఆధారంగా 12వ తరగతి మార్కులు ఇవ్వనున్నట్లు
తెలిపింది. కాగా 30:30:40 ఫార్ములా ఆధారంగా ఫలితాలు విడుదల
చేయనున్నట్లు సీబీఎస్‌ఈ పేర్కొంది. ఇందుకు సంబంధించి సీబీఎస్‌ఈ బోర్డు మార్కుల
ప్రణాళికను గురువారం సుప్రీంకోర్టుకు
సమర్పించింది.
ఇందులో 10,11 తరగతుల మార్కుల నుంచి 30 శాతం వెయిటేజీ, 12వ తరగతిలో టెర్మ్ పరీక్షల నుంచి 40 శాతం వెయిటేజీ
ఇవ్వనున్నారు.ఈ విధానంతో సంతృప్తి చెందనివారు పరీక్షలకు హాజరుకావొచ్చని పేర్కొంది.
కాగా జూలై 31లోపు సీబీఎస్‌ఈ 12వ తరగతి
ఫలితాలు విడుదలవుతాయని సీబీఎస్‌ఈ బోర్డు తెలిపింది.
మరోపక్క అదే రోజున సీఐఎస్‌సీఈ
ఫలితాలకు వెల్లడించాలని భావిస్తోంది.
0 Komentar