12వ తరగతి ఫలితాలను జులై 31లోపు
ప్రకటించాలి - రాష్ట్రాల బోర్డులకు సుప్రీం ఆదేశం
పన్నెండో తరగతి పరీక్షల అంతర్గత
మూల్యాంకన ఫలితాలను జులై 31 లోపు ప్రకటించాలని రాష్ట్రాల బోర్డులను సుప్రీం కోర్టు
ఆదేశించింది. ఆయా బోర్డులకు తమదైన మదింపు విధానాన్ని రూపొందించుకునే స్వేచ్ఛ
ఉంటుందని స్పష్టం చేసింది. అన్ని బోర్డులు ఒకే మదింపు విధానాన్ని అనుసరించాలంటూ
తాము ఆదేశాలు జారీ చేయలేమని పేర్కొంది. అయితే ఆ విధానాలు లోప రహితమని తాము ముందే
చెప్పబోవడం లేదని వ్యాఖ్యానించింది.
ఫలితాల ప్రకటన తర్వాత విద్యార్థుల
సందేహాలను తీర్చేలా ఆ విధానం ఉండాలని సూచించింది. తమ మదింపు విధానాన్ని గురువారం
నుంచి 10 రోజుల్లోపు, సాధ్యమైనంత త్వరగా రూపొందించుకోవాలని
తెలిపింది. కరోనా దృష్ట్యా పరీక్షలను నిర్వహించకుండా బోర్డులను ఆదేశించాలని,
అన్ని బోర్డులు ఒకే విధమైన మదింపు విధానాన్ని పాటించాలని కోరుతూ
దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం పై విధంగా ఆదేశాలు ఇచ్చింది.
సీబీఎస్‌ఈ, సీఐఎస్‌ఈసీ బోర్డులు కూడా 12వ తరగతి ఫలితాలను
జులై 31లోపు ప్రకటించనున్న సంగతి తెలిసిందే.
0 Komentar