COVID-19 relief up to ₹10 lakh for
victims' families tax-free
కోవిడ్-19 బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల పన్ను మినహాయింపు
కొవిడ్-19
చికిత్స కోసం యాజమాన్యాలు తమ ఉద్యోగులకు ఇచ్చిన మొత్తానికి పూర్తి పన్ను
మినహాయింపు వర్తిస్తుందని ఆదాయపు పన్ను విభాగం స్పష్టం చేసింది. ఉద్యోగులు
మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులకు సంస్థలు ఇచ్చిన పరిహారం (ఎక్స్‌గ్రేషియా)
మొత్తంపైనా ఎలాంటి పన్ను ఉండదని పేర్కొంది. ఇతర వ్యక్తుల నుంచి స్వీకరించిన ఆర్థిక
సహాయం మొత్తం రూ.10 లక్షలకు కూడా పన్ను మినహాయింపు
లభిస్తుందని పేర్కొంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో చికిత్స కోసం పలువురికి వారి
శ్రేయోభిలాషులు, బంధువులు ఆర్థిక సహాయం చేశారని, వారికి లభించిన మొత్తానికి లెక్కలు చూపడం లాంటి అవసరం లేకుండా ఈ చర్య
తోడ్పడుతుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ట్విటర్‌లో పెట్టిన ఒక
ప్రకటనలో వెల్లడించింది.
పన్ను చెల్లింపుదారులకు సంబంధించిన
సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ‘వివాద్ సే విశ్వాస్’ పథకాన్ని ఆగస్టు 31
వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. పన్ను చెల్లించేందుకు అక్టోబరు 31 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. స్థిరాస్తిని
విక్రయించినప్పుడు ఆ మొత్తాన్ని 2 లేదా మూడేళ్లలో నిబంధనల
ప్రకారం తిరిగి పెట్టుబడి పెట్టాలి. ఈ గడువు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 29 వరకూ ఉంటే.. సెప్టెంబరు 30 వరకు ఆ పెట్టుబడులు పెట్టేందుకు అనుమతినిచ్చింది.
Many taxpayers & their families have received financial help from employers & well-wishers for COVID-19 treatment or ex-gratia help following COVID-related deaths. To ensure that no income tax liability arises on this account, the following exemptions have been granted: pic.twitter.com/NFkNJWQ8RT
— NSitharamanOffice (@nsitharamanoffc) June 25, 2021
0 Komentar