Covid: How to Update Vaccination Status in
Aarogya Setu App
‘ఆరోగ్య సేతు’ మొబైల్
అప్లికేషన్‌లో వ్యాక్సిన్ స్టేటస్ అప్‌డేట్ చేసుకొండీ ఇలా
‘ఆరోగ్య సేతు’ మొబైల్
అప్లికేషన్‌లో ఇప్పుడు ఎవరికివారే తమ వ్యాక్సిన్ స్థితిపై తాజా వివరాలను నమోదు
చేసుకోవచ్చు. ఇతర ప్రాంతాల్లో పర్యటించేవారికి ఇబ్బందులు తలెత్తకుండా ఈ సదుపాయం
ఉపకరిస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ఐటీ, ఎలక్ట్రానిక్స్
శాఖ మంగళవారం వివరాలను వెల్లడించింది. ‘‘ఆరోగ్యసేతు యాప్ వినియోగదారులంతా ఈ
అప్లికేషన్ తాజా వెర్షన్‌లో తమ వ్యాక్సిన్ స్థితిపై వివరాలను పొందుపరుచుకోవచ్చు.
ఒక్క డోసు తీసుకున్నవారి యాప్
హోంస్క్రీన్‌పై నీలం రంగు బోర్డరు, ఆరోగ్యసేతు లోగో, వ్యాక్సిన్ వివరాలు ఉంటాయి. రెండో డోసు తీసుకున్న 14 రోజులకు... ‘బ్లూ షీల్డ్’, రెండు టిక్కు మార్కులు
కనిపిస్తాయి. రెండో డోసు తీసుకున్నవారి అప్లికేషన్ హోంస్క్రీన్ మీద ‘‘యు ఆర్
వ్యాక్సినేటెడ్’’ అని సందేశం కనిపిస్తుంది. కొవిన్ పోర్టల్‌లో వివరాల ఆధారంగా
ఆరోగ్యసేతు యాప్‌లో ఎప్పటికప్పుడు వినియోగదారుల వ్యక్తిగత టీకా స్థితి
మారుతుంటుంది.
ఈ యాప్‌లో సెల్ఫ్ ఎసెస్‌మెంట్‌లో
భాగంగా వివరాలు నమోదు చేసేటప్పుడు... ‘పార్షియల్లీ వ్యాక్సినేషన్ / వ్యాక్సినేటెడ్
(అన్‌వెరిఫైడ్)’ అనే ట్యాబ్ కనిపిస్తుంది. దానిపై నొక్కితే కొవిన్ పోర్టల్
నుంచి సంబంధిత మొబైల్‌కు ఓటీపీ నంబరు వస్తుంది. ఆ సంఖ్యను యాప్‌లో నమోదు చేయడం
ద్వారా వ్యక్తిగత టీకా వివరాలు అప్‌డేట్ అవుతాయి’’ అని ఐటీశాఖ తెలిపింది. దేశంలో
ఆరోగ్యసేతు యాప్‌ను 19 కోట్ల మంది వినియోగిస్తున్నారు.
0 Komentar