CoWIN Portal is Now Available in Hindi, and
Other Regional Languages Including Punjabi, Telugu
కొవిన్ పోర్టల్: ఇక ప్రాంతీయ భాషల్లోనూ రిజిస్ట్రేషన్
కరోనా టీకా రిజిస్ట్రేషన్ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొవిన్ పోర్టల్.. ఇప్పుడు హిందీతో సహా 10 ప్రాంతీయ భాషల్లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తెలుగు, మరాఠీ, మలయాళం, పంజాబీ, గుజరాతీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ, ఒడియా భాషల్లోనూ రిజిస్ట్రేషన్ చేసుకునేలా మార్పులు చేసినట్లు వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలో సోమవారం జరిగిన ఉన్నతస్థాయి మంత్రుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
దేశంలో 18ఏళ్లు
పైబడిన వారు కరోనా టీకా పొందాలంటే కొవిన్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదుచేసుకోవాలి.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ సమయంలో భాష
కారణంగా సమస్యలు ఎదురవుతున్నాయి. దాంతో ప్రజలు టీకా కేంద్రాల్లోని సిబ్బంది సహకారం
తీసుకుంటున్నారు. దానివల్ల సిబ్బందిపై ఒత్తిడి పడుతుందని గుర్తించిన ప్రభుత్వం..
హిందీతో సహా పలు ప్రాంతీయ భాషల్లోకి ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. వారిపై
ఒత్తిడి తగ్గడం వల్ల ఎక్కువ మందికి టీకా ఇచ్చేందుకు అవకాశాలు పెరుగుతాయని
ప్రభుత్వం భావిస్తోంది. ఇక, దేశవ్యాప్తంగా జనవరిలో
ప్రారంభమైన కరోనా టీకా కార్యక్రమం కింద ఇప్పటివరకు 22కోట్ల
మందికిపైగా టీకాలు అందాయి.
0 Komentar