Delhi Govt To Give Tablets to Over 2,000
Teachers
ఉపాధ్యాయులకు ట్యాబ్స్ అందిస్తాం - దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా
మహమ్మారి కరోనా ప్రపంచాన్ని
చుట్టుముట్టాక విద్యారంగంలో ఆన్‌లైన్
బోధన ఊపందుకుంది. ఈ నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను శుక్రవారం
ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వివరించారు. ‘‘ప్రతి ఒక్క విద్యార్థికి సరైన విధంగా
విద్యాబోధనను చేరువ చేయడమే మా లక్ష్యం. వారికి అర్థమయ్యేలా పాఠాలు చెప్పేందుకు
ఉపాధ్యాయులకు ట్యాబ్స్ అందించనున్నాం.
ఇది కేవలం పిల్లలకు పాఠాలు
చెప్పేందుకే కాదు, ఉపాధ్యాయులు సాంకేతికతకు సంబంధించిన విషయాలు నేర్చుకునేందుకు
ఉపయోగపడుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. కొవిడ్ కాలంలో ఉపాధ్యాయులు ఎలాంటి
ఇబ్బందులు పడకుండా టెక్నాలజీ సాయంతో ఉద్యోగం చేసుకోవచ్చు. ఆన్‌లైన్ వేదికగా
విద్యార్థులకు పాఠాలు బోధించవచ్చు’’ అని వివరించారు. కాగా 2018-19 ఏడాదికి గాను 60,555 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్స్
అందించినట్లు దిల్లీ ప్రభుత్వం వెల్లడించింది.
0 Komentar