DRDO successfully flight tests New
Generation Agni Prime Ballistic Missile
DRDO Agni Series: అగ్ని
ప్రైమ్ ప్రయోగం విజయవంతం
అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఆధునిక అగ్ని ప్రైమ్ క్షిపణిని నేడు భారత్ విజయవంతంగా పరీక్షించింది. అగ్ని శ్రేణి క్షిపణుల్లో భాగమైన దీన్ని ఒడిశా తీరంలో పరీక్షించారు. షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి అయిన ఇది 1000-1500 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాలను సునాయాసంగా ఛేదించగలదు. 1000 కిలోల వరకు అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం దీని సొంతం.
రెండు స్టేజీలు గల ఈ క్షిపణి అగ్ని-1 కంటే తేలికగా ఉండడం విశేషం. 4000 కి.మీ రేంజ్ కలిగిన అగ్ని-4, 5000 కి.మీ రేంజ్ కలిగిన అగ్ని-5 ఫీచర్లను సైతం అగ్ని ప్రైమ్‌లో మిళితం చేశారు. ఓవైపు కరోనా మహమ్మారిపై పోరులో.. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీర్‌డీఓ) క్రియాశీలకంగా వ్యవహరిస్తూనే, మరోవైపు రక్షణ రంగ బాధ్యతలను సైతం సకాలంలో పూర్తి చేస్తుండడం విశేషం.
DRDO successfully flight tests New Generation Agni P Ballistic Missile https://t.co/vEPsqyfUpG pic.twitter.com/XoYPGiwEpR
— DRDO (@DRDO_India) June 28, 2021
0 Komentar