DSC 2008: అభ్యర్థులకు
ప్రత్యేక రిక్రూట్‌మెంట్ - AP TET 2020-21 సిలబస్ సిద్ధం
డీఎస్సీ-2008 అభ్యర్థుల్లో 2,193 మంది అర్హులకు ఎస్‌జీటీ పోస్టింగులివ్వాలని నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వీరికోసం ప్రత్యేక నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు చెప్పారు. మినిమమ్ టైమ్ స్కేల్ విధానంలో పని చేసేందుకు అభ్యర్థులు రాత పూర్వకంగా అంగీకారం తెలిపారన్నారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కేవలం డీఎస్సీ-2008 అభ్యర్థులకు మాత్రమే వర్తించేలా 2,193 మంది అర్హులకు ఎస్‌జీటీ పోస్టింగులివ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. దీనికి సంబంధించి త్వరలోనే జీవో విడుదల చేస్తామని మంత్రి తెలిపారు.
‘‘2018 డీఎస్సీలో నోటిఫై
చేసిన 7,042 పోస్టులకు గాను ఇప్పటికే 6,361 పోస్టులను భర్తీ చేసి అపాయింట్‌మెంట్లు ఇచ్చాం. కోర్టు కేసుల నేపథ్యంలో
ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న 486 పీఈటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థులకు ఇవాళ నియామక
పత్రాలు అందిస్తాం. అలాగే 2018 డీఎస్సీలో పెండింగ్‌లో ఉన్న 374 పోస్టులను సైతం త్వరలోనే భర్తీ చేస్తాం.
AP TET 2020-21 సిలబస్
ఏపీ టెట్ 2020-21 పరీక్షకు సంబంధించిన సిలబస్‌ను సిద్ధం చేశాం. దీనికి సంబంధించిన పూర్తి
సమాచారాన్ని http://aptet.apcfss.in/ వెబ్‌సైట్‌లో
అందుబాటులో ఉంచాం’’ అని మంత్రి వివరించారు.
0 Komentar