Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Father's Day: ‘ఫాదర్స్‌ డే’ సందర్భంగా జియో మార్ట్‌ సరికొత్త ప్రచారం

 

Father's Day: ‘ఫాదర్స్‌ డే’ సందర్భంగా జియో మార్ట్‌ సరికొత్త ప్రచారం

ఫాదర్స్‌ డే’ సందర్భంగా జియో మార్ట్‌ సరికొత్త రీతిలో స్పందించింది. ‘బీడాడ్‌టుడాడ్‌’ (BeDaDToDAD) ప్రచారాన్ని వినూత్నంగా ఆవిష్కరించింది. ఈ కంపెనీ విడుదల చేసిన వ్యాపార ప్రకటనలో తండ్రి ఆరోగ్యంగా ఉండాల్సిన ఆవశ్యకతను పిల్లలతో చెప్పించారు. ఇదివరకెన్నడూ చూపించని వినూత్న పద్ధతిలో తెలియజెప్పారు.

చిన్న చిన్న జీవన శైలి విధానాలను ఎలా మార్చుకోవచ్చో అందులో వివరించారు. రిలయన్స్‌ రిటైల్‌కు చెందిన ఈ కంపెనీ... ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి ప్లాట్‌ఫాంపై ఈ డిజిటల్‌ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో తండ్రి తన ఆరోగ్యం పట్ల వహిస్తున్న నిర్లక్ష్యాన్ని వీడేలా ఇద్దరు పిల్లలు చేసే పనులను హృద్యంగా, భావోద్వేగంగా అదే సమయంలో నవ్వు తెప్పించేలా చూపించారు. తండ్రి తన పట్ల తాను బాధ్యతగా ఉండడాన్ని గుర్తించేలా వారు చేశారు. జియో మార్ట్‌తో కలిసి తండ్రికి తండ్రిగా మారండి అంటూ బలమైన సందేశాన్ని అందులో వినిపించింది. 

Previous
Next Post »
0 Komentar

Google Tags