Fevicol: ఫెవికాల్
సమయస్ఫూర్తి మరియు మార్కెటింగ్ క్రియేటివిటీ అంటే ఇదే
సంక్షోభాన్ని అవకాశంగా మలచుకోవడం గురించి వినే ఉంటాం. ఈ ఫెవికాల్ ప్రకటన చూస్తే మాత్రం దానర్థం ఇదేనా అనిపించకమానదు. సరిగ్గా అదే చేసింది ఈ సంస్థ. కాకపోతే ఇక్కడ సంక్షోభం వేరొకరిది. అవకాశం మాత్రం తనది! దీంతో ఫెవికాల్ సమయస్ఫూర్తిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ విషయం.. ప్రముఖ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో ఇటీవల ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వ్యవహరించిన తీరు కోకాకోలా కంపెనీకి భారీ నష్టాన్ని తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. తన ముందున్న కోక్ బాటిళ్లను పక్కన పెట్టి నీరు తాగడంటూ ఇచ్చిన సంజ్ఞ ఆ కంపెనీకి రూ.29వేల కోట్ల నష్టాన్ని మిగిల్చింది. దీన్నే తాజాగా ఫెవికాల్ తనకు అనుకూలంగా మలుచుకుంది. ప్రెస్‌కాన్ఫరెన్స్ టేబుల్‌పై కోక్ బాటిళ్ల బదులు రెండు ఫెవికాల్ బాటిళ్లను ఉంచి.. ‘దీన్నెవరు జరపలేరు.. విలువ పడిపోదు’ అనే వ్యాఖ్యను జోడించింది. దీనిపై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఫెవికాల్ అద్భుతమైన మార్కెటింగ్
వ్యూహం అనుసరించిందంటూ ప్రముఖ వ్యాపారవేత్త హర్షా గొయెంకా ప్రశంసిస్తూ ట్వీట్
చేశారు. క్రియేటివిటీకి హ్యాట్సాఫ్ అంటూ పలువురు కామెంట్లు పెట్టారు. ఒకవేళ
ఫెవికాల్ వేసిన కుర్చీలో రొనాల్డో కూర్చుని ఉంటే పరిస్థితి ఏంటో! అంటూ మరికొందరు
ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
Ronaldo moves two bottles of Coke aside in a press conference and tells people to drink water instead
— Morning Brew ☕️ (@MorningBrew) June 16, 2021
Coca Cola fell ~1.6% soon afterwards, good for a today $4 billion drop in market cap
pic.twitter.com/fbAXH2orxc
Haye ni mera Coka Coka Coka Coka Coka#Euro2020 #Ronaldo #MazbootJod #FevicolKaJod pic.twitter.com/lv6YWrgfxB
— Fevicol (@StuckByFevicol) June 17, 2021
0 Komentar