French Open 2021: ఫ్రెంచ్
ఓపెన్ -2021 సింగిల్స్ విజేత జకోవిచ్
ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను జకోవిచ్ కైవసం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన తుది పోరులో ఐదోసీడ్ సిట్సిపాస్‌పై జకోవిచ్ 6-7, 2-6, 6-3, 6-2,6-4 తేడాతో విజయం సాధించి మరోసారి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ విజయంతో జకోవిచ్ 19 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి రెండు సెట్లను గెలిచి కెరీర్‌లో మొదటి టైటిల్‌ను కైవసం చేసుకుందామనుకున్న గ్రీక్ వీరుడు సిట్సిపాస్ ఆశలను జకో వమ్ము చేశాడు. తొలి రెండు కోల్పోయి వెనుకపడ్డ జకో.. అద్భుతంగా పుంజుకున్నాడు. ఇక ఆపై వెనుదిరగని జకో 6-3, 6-2తో ప్రత్యర్థిని కోలుకోనివ్వలేదు. దీంతో నాలుగుసెట్లు ముగిసే సరికి ఇద్దరు సమంగా నిలిచారు. ఇక నిర్ణయాత్మక ఐదో సెట్ హోరాహోరీగా సాగింది. గెలుపు కోసం ఇద్దరూ తమ శక్తినంతా దారపోశారు. అయితే వరల్డ్ నంబర్‌వన్ జకో తన అనుభవంతో చివరిసెట్‌ను 6-4 తేడాతో గెలిచి ఫ్రెంచ్ ఓపెన్‌ను ముద్దాడాడు. ఈ విజయంతో వింబుల్డన్, యూఎస్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌లను కనీసం రెండుసార్లు గెలిచిన మొదటి వ్యక్తిగా జకో చరిత్రకెక్కాడు. జకోవిచ్ చివరిసారిగా 2016లో ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్నాడు. జకోవిచ్ మరో టైటిల్ సాధిస్తే 20 టైటిళ్లతో ఆల్‌టైమ్ రికార్డ్ హోల్డర్లుగా ఉన్న ఫెదరర్, నాదల్ సరసన నిలుస్తాడు.
తొలిసారి గ్రాండ్ స్లామ్ టైటిల్
గెలిచిన క్రెజికోవా
అన్‌సీడెడ్
ప్లేయర్ బార్బోరా క్రెజికోవా అద్భుతం చేసింది.
డబుల్స్ ప్లేయర్‌గా ముద్రపడ్డ
పాతికేళ్ల చెక్ భామ సింగిల్స్‌లో సంచలనం
సృష్టించింది..! వయసు తక్కువే అయినా..
తగినంత అనుభవం లేకున్నా.. ఇప్పటిదాకా
ఆడింది ఐదు గ్రాండ్‌స్లామ్సే అయినా.. ఫ్రెంచ్‌ఓపెన్
విమెన్స్ టైటిల్ నెగ్గి ఔరా అనిపించింది..! 52
గ్రాండ్‌స్లామ్స్ ఆడిన అనుభవం ఉన్న 29 ఏళ్ల రష్యా స్టార్ పవ్లుచెంకోవాకు తుది పోరులో చెక్‌పెట్టి
ఫ్రెంచ్ కోటలో కొత్త క్వీన్‌గా నిలిచింది. శనివారం
జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 33వ ర్యాంకర్
క్రెజికోవా 6–1, 2–6, 6–4తో 31వ సీడ్
అనస్తేసియా పవ్లుచెంకోవాపై అద్భుత విజయం సాధించింది.
డబ్సుల్స్‌లోనూ తనే..
మరోవైపు ఫ్రెంచ్ ఓపెన్ మహిళల
డబుల్స్ టైటిల్‌ను చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి క్రెజికోవా-సినియాకోవా జోడీ
సొంతం చేసుకుంది. ఫైనల్‌లో క్రెజికోవా-సినియాకోవా జంట 6-4, 6-2 తేడాతో స్వైతెక్-సాండ్స్‌పై గెలుపొందారు. సింగిల్స్ విజేత డబుల్స్‌లోనూ
గెలవడం 20 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
0 Komentar