Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Google Messages set to get auto-OTP deletion and ‘SMS Categories’ features


Google Messages set to get auto-OTP deletion and ‘SMS Categories’ features

గూగుల్ మెసేజింగ్ యాప్‌ లో మరో రెండు సరికొత్త ఫీచర్లు

రోజూ మన ఫోన్‌కు ఎన్నో రకాల మెసేజ్‌లు వస్తుంటాయి. వాటిలో స్నేహితులు, బంధుమిత్రులు పంపేవే కాకుండా వాణిజ్యపరమైనవి. అందులో మనకు అనవసరమైన వాటిని సెలెక్ట్ చేసి డిలీట్ చేయాలంటే ఎంతో కొంత సమయం కేటాయించాల్సిందే. దీనికి పరిష్కారంగా గూగుల్‌ మెషీన్ లెర్నింగ్‌ సాంకేతికతతో సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది.

1. మెసేజ్‌ల కేటగిరీ: ఇది మెసేజ్‌లను కేటగిరీల వారీగా విభజిస్తుంది. అంటే వ్యక్తిగతమైనవి, ఓటీపీలు, బ్యాంక్‌ లావాదేవీలు వంటి వాటిని కేటగిరీలుగా విభజించి ఆయా ఫోల్డర్లలోకి పంపిస్తుంది. దీని వల్ల యూజర్స్ తమకు అవసరమైన సమాచారాన్ని సులభంగా పొందుతారని గూగుల్ వెల్లడించింది. 

2. ఓ‌టి‌పి డిలీట్: దీంతోపాటు గూగుల్ మెసేజింగ్ యాప్‌కు మరో కొత్త ఫీచర్‌ను కూడా పరిచయం చేసింది. ఇందులో మెసేజ్‌ ఇన్‌బాక్స్‌కు వచ్చే ఓటీపీ (వన్‌ టైం పాస్‌వర్డ్‌)లు 24 గంటల వ్యవధిలో వాటంతటవే డిలీట్‌ అవుతాయని గూగుల్ తెలిపింది. ఈ ఫీచర్‌ కోసం ఫోన్‌ స్క్రీన్‌ మీద మెసేజింగ్ యాప్‌కు సంబంధించి సలహాలతో కూడిన పాప్‌-అప్ విండో ప్రత్యక్షమైనప్పుడు కంటిన్యూ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. అలానే ఈ ఫీచర్ ఆండ్రాయిడ్‌ 8 ఓఎస్‌ లేదా ఆపై వెర్షన్ ఓఎస్‌లతో పనిచేస్తున్న ఫోన్లను మాత్రమే సపోర్ట్ చేస్తుందని తెలిపింది.

యూజర్‌కి మెరుగైన సేవలందించడం కోసం ఈ ఫీచర్లును తీసుకొచ్చామని, వీటిని ఉపయోగించాలా, వద్దా అనే ఐచ్ఛికాన్ని యూజర్‌ ఎంపిక చేసుకోవచ్చని గూగుల్ చెప్పింది. ఇందుకోసం ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మార్పులు చేసుకోవాలని సూచించింది.

Google Messaging APP

Previous
Next Post »
0 Komentar

Google Tags