ఆనందయ్య ‘కె’ మందుకు హైకోర్టు
అనుమతి
నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఇస్తున్న ఔషధాల్లో ఒకటైన ‘కె’ మందుకు హైకోర్టు అనుమతిచ్చింది. గతంలో ఆనందయ్య ఇతర మందులకు అనుమతిచ్చిన ప్రభుత్వం కంట్లో వేసే చుక్కల మందుకు అనుమతి ఇవ్వలేదు. ఆయుష్ నివేదికకు సంబంధించి పూర్తి వివరాలు రాని నేపథ్యలో దీనికి అనుమతి లభించలేదు. ఈ నేపథ్యంలో దీనిపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా బాధితులకు తక్షణమే ‘కె’ మందు పంపిణీ చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. కంటి చుక్కల మందుకు సంబంధించి 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆనందయ్య మందు పంపిణీ విషయంలో
హైకోర్టు కొన్ని సూచనలు చేసింది. మందు తయారీకి పదార్థాలు సేకరించే విషయంలో
అనుభవం లేని వాళ్లు కాకుండా.. నిపుణులు సేకరించాలని సూచించింది. మందుకు
సంబంధించి పదార్థాల సేకరణ, తయారీలో ఔషధ నియంత్రణ సంస్థ ప్రమాణాలను
కచ్చితంగా పాటించాలని తెలిపింది. మందును కలుషిత ప్రాంతాల్లో కాకుండా పరిశుభ్రమైన
ప్రాంతాల్లో తయారు చేయాలని స్పష్టం చేసింది. దీనిపై తదుపరి విచారణను
హైకోర్టు ఈనెల 21కి వాయిదా వేసింది.
0 Komentar