How ‘Skater Girl’ Manjari Makijany made
a skatepark in a village in Rajasthan
సినిమా కోసం
స్కేటింగ్ పార్క్ - చిన్నారులకూ ఉపయోగపడాలని శాశ్వతంగా
నిర్మించిన చిత్ర బృందం
అయితే ఓ వైపు
సినిమా తీస్తూనే అక్కడి చిన్నారుల జీవితాల్లో
మార్పు తెచ్చిన స్ఫూర్తిమంతమైన ఘటన రాజస్థాన్‌లో జరిగింది. ‘స్కేటర్ గర్ల్’
నెట్‌ఫ్లిక్స్‌లో ఈనెల 11న విడుదలైన సినిమా. మంజరి మకిజన్య్ ఆ
చిత్రానికి దర్శక-నిర్మాత. రాజస్థాన్‌లోని
ఓ మారుమూల గ్రామంలో స్కేటింగ్ క్రీడలో రాణించాలని కలలు గనే పదహారేళ్ల అమ్మాయి
చుట్టూ తిరిగే కథ ఇది. సినిమాకోసం ఉదయ్‌పుర్‌కి సమీపంలోని ఖేమ్‌పుర్ గ్రామంలో
భారీ స్కేటింగ్ పార్క్‌ను ఏర్పాటు చేసింది చిత్రబృందం. అంతేకాదు క్రీడపై ఆసక్తి
కలిగిన చిన్నారుల కోసం ఓ స్కేటింగ్ కమ్యూనిటీని ఏర్పాటు చేశారు ఆ చిత్ర
దర్శక-నిర్మాత మంజరి మకిజన్య్.
స్కేటింగ్
గురించి ఏమాత్రం పరిచయం లేని ఓ మారుమూల ప్రాంతంలో సినిమాను తీయాలనుకున్నారు
దర్శకురాలు మంజరి. అందుకు రాజస్థాన్‌లోని ఖేమ్‌పుర్ అనే మారుమూల గ్రామాన్ని
ఎంచుకున్నారు. ఆ ప్రాంతంలోనే ఓ స్కేటింగ్
పార్క్‌ను నిర్మించేందుకు నిధులను సేకరించారు. సినిమా తర్వాత కూడా అక్కడ పిల్లలు
శిక్షణ పొందాలనే లక్ష్యంతో అన్ని హంగులతో 14,500 చదరపు అడుగుల
విస్తీర్ణంలో ‘డిసెర్ట్ డాల్ఫిన్ స్కేట్ పార్క్’ను నిర్మించారు. సినిమాకు
మించిన జీవిత కాల ప్రాజెక్ట్‌గా దీన్ని భావించారు. అందుకే క్రీడా పార్క్‌ను అలా
నిర్మించి వదిలేయకుండా ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి వాలంటీర్ల సాయంతో శిక్షణ
కార్యక్రమాలు కూడా చేపట్టింది చిత్ర బృందం.
‘స్కేటర్ గర్ల్’ సినిమాలోలాగే ఖేమ్‌పుర్ వాసులు కూడా మొదట్లో దీన్నొక వింత క్రీడగా చూసేవారు. పిల్లలు గాయపడతారనే భయంతో వారికి స్కేటింగ్‌పై భయం, అయిష్టత ఉండేది. అయితే పార్క్ అందుబాటులోకి వచ్చాక పిల్లలు తమను తాము నిరూపించుకోడానికి, ఆత్మవిశ్వాసం పెరగడానికి దోహదపడుతుందని గుర్తించి శిక్షణకు పంపించడం మొదలుపెట్టారు. అయితే అక్కడ ఇప్పటికీ కొన్ని సమస్యలున్నాయి. మగపిల్లలతో పోల్చితే శిక్షణ తీసుకుంటున్న ఆడపిల్లల సంఖ్య చాలా తక్కువ. తల్లిదండ్రులు అమ్మాయిలను పంపేందుకు ఇంకా వెనకాడుతున్నారు. స్కేటర్ గర్ల్ సినిమా చూశాక ఖేమ్‌పుర్ వాసుల్లో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు దర్శకురాలు.
0 Komentar