How to Lose Weight...? 15 Best Tips for Weight
Loss
బరువు తగ్గడం ఎలా..? - బరువు తగ్గడానికి 15 ఉత్తమ చిట్కాలు
ఆధునిక జీవన శైలి వలన మనకు
తెలియకుండానే బరువు పెరుగుతున్నాము. కూర్చొని పని చేసే ప్రతి ఉద్యోగి, వ్యాపారి
కూడా తన బరువు మీద అవగాహనతో ఉండటం ఎంతైనా మంచిది. ముఖ్యంగా 35 దాటిన వాళ్ళు తమ బరువు మీద నియంత్రణ కలిగి ఉండాలి.
బరువు తగ్గడానికి చిట్కాలు
1. బరువు తగ్గడానికి వ్యాయామ
నిపుణుల సూచించే ఎక్సర్ సైజ్ లు రెగ్యులర్ గా చేయడం ద్వారా బరువును కంట్రోల్
చేయవచ్చు.
2. యోగ మరియు ఏరోబిక్
ఇలాంటి వ్యాయామం చేయండి ఇది మీ కేలరీలను కరుణించడానికి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఒక అద్భుతమైన మార్గం.
3. చిన్న ప్లేటులో
(పళ్ళెం) తినండి. మీకు తెలీకుండానే మీరు తక్కువ తినడం ప్రారంభిస్తారు.
4. సాధ్యమైనంత వరకూ రాత్రి
సమయంలో త్వరగా భోజనం ముగించడం ఆరోగ్యకరం.
5. పంచదార తీసుకోవడం
కంట్రోల్ చేసుకోవాలి. పంచదారకు బదులుగా తేనెను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.
6. మన శరీరంలో రోజంతా
జీవక్రియలు చురుకుగా పనిచేయాలంటే తప్పనిసరిగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి.
7. రాత్రి భోజనం మితంగా
తీసుకోవడం ఆరోగ్యకరం.
8. ప్రోటీనులున్న ఆహారాలను
తీసుకోవడానికి ప్రయత్నించండి.
9. రాత్రి భోజనానికి ముందు
లేదా ఈవెనింగ్ సమయంలో మీరు ఇటువంటి ఫ్రైడ్ స్నాక్స్ కు చెక్ పెట్టి గుప్పెడు నట్స్
ను తినడానికి ప్రాధాన్యత ఇవ్వండి.
10. తాజా పండ్లను జ్యూస్ ల
రూపంలో కాకుండా తినడం వల్ల శరీరానికి అధిక ఫైబర్ అందుతుంది.
11. హోం మేడ్ ఫుడ్స్ కు
మరింత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. బయట తినాల్సి వస్తే మితంగా తీసుకోవాలి.
12. పరగడుపున తురిమిన
వెల్లుల్లి రెబ్బలను తేనెతో కలిపి తీసుకోవడం మంచిది. ఇది రోగ నిరోధక వ్యవస్థను
మెరుగుపరుస్తుంది కూడా.
13. వెల్లుల్లి నిమ్మరసంతో
కలిపి తినవచ్చు. ఇవి మీ బరువు తగ్గడానికి సహాయపడతాయి.
14. నాణ్యమైన బ్లాక్ కాఫీ,
గ్రీన్ టీ లు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
15. భోజనానికి 30 నిముషాల ముందు నీళ్ళు బాగా త్రాగండి. ఆకలి ప్రభావం అంతగా తెలియదు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం.
0 Komentar