Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Indian Coast Guard Recruitment 2021: Notification Out for 350 Vacancies - Details Here

 

Indian Coast Guard Recruitment 2021: Notification Out for 350 Vacancies - Details Here 

ఇండియన్ కోస్ట్ గార్డులో 350 పోస్టుల కొరకు నోటిఫికేషన్ విడుదల – ముఖ్యమైన వివరాలు ఇవే

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డు, ఆర్మ్డ్ ఫోర్స్ ల్లో  .. నావిక్ (జనరల్ డ్యూటీ), నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్), యాంత్రిక్ 01/2022 బ్యాచ్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 350

పోస్టులు-ఖాళీలు:

 1) నావిక్ (జనరల్ డ్యూటీ): 260

2) నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్): 50

3) యాంత్రిక్ (మెకానికల్): 20

4) యాంత్రిక్ (ఎలక్ట్రికల్): 13

5) యాంత్రిక్ (ఎలక్ట్రానిక్స్): 07

అర్హత, వయసు:

1) నావిక్ (జనరల్ డ్యూటీ): మ్యాడ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.

వయసు: 18-22 ఏళ్ల మధ్య ఉండాలి. 01 ఫిబ్రవరి 2000 - 31 జనవరి 2004 మధ్య జన్మించి ఉండాలి.

2) నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్): గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డుల నుండి పదో తరగతి ఉత్తీర్ణత.

వయసు: 18-22 ఏళ్ల మధ్య ఉండాలి. 01 ఏప్రిల్ 2000 - 31 మార్చి 2004 మధ్య జన్మించి ఉండాలి.

3) యాంత్రిక్: గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డుల నుండి పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్(రేడియో/ పవర్) ఇంజినీరింగ్ లో డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: 18-22 ఏళ్ల మధ్య ఉండాలి. 01 ఫిబ్రవరి 2000 - 31 జనవరి 2004 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: దీనికి ఎంపిక విధానం వివిధ దశల్లో ఉంటుంది. స్టేజ్ 1, 2, 3, 4 ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

మొదటి దశ(స్టేజ్-1): స్టేజ్-1లో రాతపరీక్ష ఉంటుంది. ఇందులో సెక్షన్-1, 2, 3, 4, 5 పరీక్షలు నిర్వహిస్తారు. సంబంధిత పోస్టులకు ఏ సెక్షన్ పరీక్ష నిర్వహిస్తారు. దానిలో సాధించాల్సిన ఉత్తీర్ణత మార్కులు, సంబంధిత సబ్జెక్టుల సిలబస్, పరీక్షా సమయం, వచ్చే ప్రశ్నల గురించి ప్రకటనలో సవివరంగా ఇచ్చారు.

రెండో దశ(స్టేజ్-2): మొదటి దశలో నిర్వహించిన కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ లో ప్రతిభ ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేస్తారు. దీని ప్రకారం స్టేజ్-2కి ఎంపిక చేస్తారు. ఇందులో ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రీ అసెస్మెంట్ టెస్ట్, తొలి మెడికల్ టెస్ట్ ఉంటాయి.

మూడో దశ (స్టేజ్-3): స్టేజ్-1, స్టేజ్-2లో ప్రతిభ ఆధారంగా స్టేజ్-3కి ఎంపిక చేస్తారు. స్టేజ్-3లో డ్యాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ మెడికల్ టెస్ట్, ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, పోలీస్ వెరిఫికేషన్ ఉంటాయి.

నాలుగో దశ (స్టేజ్-4): ఇందులో వివిధ ఎడ్యుకేషన్ బోలు/ యూనివర్సిటీలు/ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందిన ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇండియన్ కోస్టు గార్డ్ ముందు ఉంచాలి. సర్టిఫికెట్లు ఒకవేళ కచ్చితంగా(జన్యూన్) లేకపోతే టర్మినేట్ చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులకు రూ.250 (ఎస్సీ/ ఎస్టీలకు ఫీజు లేదు)

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.07.2021.

దరఖాస్తుకు చివరి తేది: 16.07.2021.

WEBSITE

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags