అంతర్జాతీయ యోగా దినోత్సవం
సందర్భంగా రాష్ట్రం లో 3 చోట్ల యోగా దినోత్సవాలు
అంతర్జాతీయ యోగా దినోత్సవం
సందర్భంగా సోమవారం రాష్ట్రంలోని 3 కేంద్ర రక్షిత వారసత్వ ప్రదేశాల్లో కార్యక్రమాలు
నిర్వహించనున్నట్లు కేంద్ర పురావస్తుశాఖ అమరావతి సర్కిల్ సూపరింటెండెంట్ సుశాంత్
కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కేంద్ర సంస్కృతి, పర్యాటకశాఖల
సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ దిల్లీలోని ఎర్రకోట వద్ద చేసే యోగాను ప్రత్యక్ష
ప్రసారం ద్వారా అనంతపురం జిల్లా లేపాక్షిలోని ఏకశిలా నంది (బసవన్న గుడి)
వద్ద ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని హిందూ
రాతి గుహాలయం, విశాఖ జిల్లా అనకాపల్లిలోని శంకరం వద్ద
ఉన్న బౌద్ధారామాల వద్ద యోగా దినోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
సహజ యోగ ధ్యాన కార్యక్రమం ప్రారంభం
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని
పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ సహజ యోగ ట్రస్టు నిర్వహిస్తున్న 'సహజ
యోగ ధ్యాన పరిచయ కార్యక్రమం ఆదివారం యూట్యూబ్ లో ప్రారంభమైంది. సహజ యోగ ధ్యానం
చేసే సమయంలో అనుసరించాల్సిన 5 విధానాలను ట్రస్టు ప్రతినిధి బొల్లా వెంకట పద్మావతి
వివరించారు. సహజ యోగ ధ్యానం ద్వారా శారీరక, మానసిక ఒత్తిడిని
అధిగమించి ప్రశాంతతను పొందొచ్చని తెలిపారు.
0 Komentar