Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Island-Like Structure Seen on Google Maps Near Kerala Coast

 

Island-Like Structure Seen on Google Maps Near Kerala Coast

Google Maps: గూగుల్‌ చూపిన కోచి తీరంలో రహస్య దీవి 

కేరళ కోచి తీరంలో అరేబియా సముద్ర గర్భంలో ఓ దీవి లాంటి నిర్మాణం కనిపించడం చర్చనీయాంశంగా మారింది. గూగుల్‌ మ్యాప్స్‌తో బయటపడిన ఈ రహస్య దీవిపై పరిశోధకులు దృష్టి సారించారు. దీన్ని తొలిసారి చెల్లనమ్‌ కర్షిక టూరిజం డెవలప్‌మెంట్‌ సొసైటీ గుర్తించింది. కోచి తీరానికి 7 కి.మీ దూరంలో ఇది ఉన్నట్లు సంస్థ అధ్యక్షుడు జేవీఆర్‌ జుల్లప్పన్‌ చెప్పారు. నీటి అడుగున ప్రవాహం కారణంగా దీవి లాంటి నిర్మాణం ఏర్పడి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

తీర అవక్షేపం, కోతకు గురికావడం వంటి కారణాల వల్ల కూడా ఏర్పడే అవకాశం ఉందన్నారు. 8 కిలోమీటర్ల పొడవు, 3.5 కిలోమీటర్ల వెడల్పుతో ఈ నిర్మాణం ఉన్నట్లు చెప్పారు. గత నాలుగేళ్లుగా ఆ ప్రాంతంలో దీవిలాంటి నిర్మాణాన్ని గమనిస్తున్నామని, అయితే దాని పరిమాణంలో మాత్రం ఎలాంటి మార్పూ రాలేదని ఆ సంస్థ తెలిపింది. దీనిపై పరిశోధన చేయాల్సిందిగా కేరళ ప్రభుత్వం రాష్ట్ర ఫిషరీస్‌ అండ్‌ ఓషన్‌ స్టడీస్‌ అధికారులను ఆదేశించింది.

MAP LOCATION

Previous
Next Post »
0 Komentar

Google Tags