JEE Main 2021, NEET 2021 Entrance Exam Dates: Update from Education Ministry
జేఈఈ, నీట్ షెడ్యూల్‌పై త్వరలో నిర్ణయం: కేంద్ర విద్యాశాఖ
కరోనాతో ఉద్ధృతితో వాయిదా పడిన
జేఈఈ (మెయిన్స్), నీట్(యూజీ) పరీక్షల షెడ్యూల్‌పై త్వరలోనే
ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు. ‘‘పెండింగ్‌లోని
జేఈఈ (మెయిన్స్) పరీక్షలు, ఆగస్టు ఒకటో తేదీన జరగాల్సిన
నీట్ పరీక్షపై త్వరలోనే సమీక్ష జరిపి ఒక నిర్ణయం తీసుకుంటాం’’ అని విద్యాశాఖకు
చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పారు.
విద్యార్థుల స్కోరింగ్
మెరుగుపరచుకునేందుకు ఈ విద్యాసంవత్సరం నుంచి జేఈఈ-మెయిన్స్ నాలుగు దశల్లో
నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా తొలి రెండు దశలను ఫిబ్రవరి, మార్చిలో
నిర్వహించారు. కరోనా కారణంగా ఏప్రిల్, మేలో జరగాల్సిన మూడు,
నాలుగు దశలు వాయిదా పడ్డాయి. నీట్ పరీక్షపై కూడా అనిశ్చితి
నెలకొంది.
0 Komentar