Jio Users Can Now Recharge Jio Mobile
Number and Vaccination Details via WhatsApp
వాట్సాప్ చాట్‌బోట్ ద్వారా టీకా
సమాచారం మరియు మొబైల్ రీఛార్జి: జియో
వాట్సాప్ చాట్‌బోట్ ద్వారా
ఇతరత్రా సేవలతో పాటు కొవిడ్ టీకా లభ్యతపైనా వినియోగదారులకు సమాచారం ఇవ్వడాన్ని
జియో ప్రారంభించింది. ప్రతిసారి వన్-టైం-పాస్‌వర్డ్ అవసరం లేకుండానే ఈ కొత్త
సేవల ద్వారా వ్యాక్సిన్ లభ్యత సమాచారాన్ని తెలుసుకోవచ్చని కంపెనీ వర్గాలు
వెల్లడించాయి. 7000770007 నెంబరుకు ‘హాయ్’ అని టైప్ చేసి ఈ
సదుపాయాన్ని పొందొచ్చని తెలిపాయి. ‘రీఛార్జ్, చెల్లింపులు,
ఫిర్యాదుల పరిష్కారం, సందేహాల నివృత్తి లాంటి
వాటి కోసం జియో వినియోగదార్లు వాట్సాప్ చాట్‌బోట్‌ను ఉపయోగించుకోవచ్చు.
ఇకపై కొవిడ్-19
టీకా లభ్యతపై సమాచారాన్ని కూడా పొందవచ్చ’ని కంపెనీ వర్గాలు తెలిపాయి. టీకా సంబంధిత
సమాచారం, జియో రీఛార్జ్ సేవల విషయంలో ఇతరత్రా మొబైల్ నెట్‌వర్క్‌లపైనా
ఈ చాట్‌బోట్ పనిచేస్తుందని పేర్కొన్నాయి. నెంబర్ పోర్టబిలిటీ సేవలు, జియో సిమ్, జియో ఫైబర్, జియో
మార్ట్, ఇంటర్నేషనల్ రోమింగ్ లాంటి వాటికి కూడా చాట్‌బోట్‌ను
ఉపయోగించుకోవచ్చని వెల్లడించాయి.
0 Komentar