'JioPhone Next' smartphone by Jio &
Google announced, to be available from Sept 10
రిలయన్స్-గూగుల్ భాగస్వామ్యంతో
జియోఫోన్ నెక్స్ట్ - అత్యంత చౌక స్మార్ట్‌ఫోన్ - సెప్టెంబర్ 10
నుంచి అమ్మకాలు
రిలయన్స్ నుంచి తొలి పూర్తి స్థాయి స్మార్ట్‌ఫోన్ అతి త్వరలో రాబోతోంది. రిలయన్స్ - గూగుల్ భాగస్వామ్యంతో అత్యంత చౌకైన ‘జియో ఫోన్ నెక్స్ట్’ను అభివృద్ధి చేసినట్లు రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 10 నుంచి ఈ ఫోన్‌ను అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు.
సరికొత్త ఫీచర్లతో..
అందుబాటు ధరలో 4జీ కనెక్టివిటీతో స్మార్ట్‌ఫోన్ కావాలనుకునేవారి కోసం జియోఫోన్ నెక్స్ట్‌ను రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది. జియో కోసం గూగుల్ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఆప్టిమైజ్డ్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఇది పనిచేస్తుంది. ఇది పూర్తిస్థాయి స్మార్ట్‌ఫోన్.
* వాయిస్ అసిస్టెంట్
* ఆటోమెటిక్ రీడ్-అలౌడ్
ఆఫ్ స్క్రీన్ టెక్స్ట్
* లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్
* రియాల్టీ ఫిల్టర్స్‌తో
స్మార్ట్ కెమెరా
వంటి ఫీచర్లు ఉన్నాయి. రెగ్యులర్
ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. గూగుల్ ప్లేస్టోర్‌ను
కూడా ఈ ఫోన్లో అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతానికైతే ఈ ఫోన్ ధరను కంపెనీ
వెల్లడించలేదు. అయితే ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తుందని
ముకేశ్ అంబానీ వెల్లడించారు.
వినియోగదారులకు అందుబాటు ధరలో ఫోన్లు అందించేందుకు 2017లో జియోఫోన్ తీసుకొచ్చింది రిలయన్స్. 4జీ కనెక్టివిటీతో తొలి స్మార్ట్ ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది. ఆ తర్వాత 2018లో జియోఫోన్ 2 విడుదల చేసింది. క్వెర్టీ కీప్యాడ్‌తో పాటు పెద్ద స్క్రీన్‌తో దీన్ని తీసుకొచ్చింది.
0 Komentar