ఒప్పంద పద్దతి లో 2008 డీఎస్సీ అభ్యర్థులకు
ఉద్యోగాలు
సుదీర్ఘ కాలంగా వేచి చూస్తున్న 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల సమస్యకు తాత్కాలికంగా పరిష్కారం లభించింది.
డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి
జగన్ ను కలిసి తమకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. వారి విజ్ఞప్తి పై స్పందించిన
సీఎం.. మినిమం టైం స్కేలు ఇచ్చి ఒప్పంద పద్దతిలో తీసుకునేందుకు అంగీకరించారు. సీఎం
నిర్ణయం మేరకు 2193 మంది అభ్యర్థులను ఒప్పంద పద్దతిలో
విధుల్లోకి తీసుకోనున్నారు. కోర్టు కేసులతో సంబంధం లేకుండా ప్రభుత్వం తరఫున
సాధ్యమైనంత మేర సాయం చేస్తామని సీఎం చెప్పారని తెలిపారు.
0 Komentar