July-2021: New Rules and Changes Effect
from July 1, 2021
జూలై 1 నుంచి
అమలులోకి రానున్న కొత్త రూల్స్ ఇవే!
డ్రైవింగ్ లైసెన్స్ నుంచి బ్యాంక్
చార్జీల వరకు జూలై 1, 2021 నుంచి అనేక కొత్త మార్పులు చోటు
చేసుకొనున్నాయి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) రేపటి నుంచి ఛార్జీలు పెంచేందుకు
సిద్దమవుతుంది. అలాగే ఎల్‌పీజీ ధరలో కూడా మార్పులు చోటు చేసుకునేందుకు అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. Driving License (డ్రైవింగ్
లైసెన్స్)
జూలై 1 నుంచి
కేంద్రం ఏర్పాటు చేస్తున్న కొత్త సిస్టమ్ ప్రకారం, ఇక నుంచి
ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ కోసం రీజనల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్(ఆర్టీఓ) ఆఫీస్
చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేంద్రం గుర్తించిన డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలలో డ్రైవింగ్ కోర్సు పూర్తి
చేసిన తర్వాత వారు ఆ కేంద్రం నుంచే శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు.
2. IFSC Codes (ఐఎఫ్‌ఎస్‌సి
కోడ్‌లు)
కేంద్రం ప్రభుత్వం తీసుకున్న
నిర్ణయం కారణంగా సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్‌లో విలీనం అయిన సంగతి
తెలిసిందే. అయితే, జులై 1 నుంచి
సిండికేట్ బ్యాంక్ ఖాతాదారులు కెనరా బ్యాంక్‌కు చెందిన కొత్త ఐఎఫ్‌ఎస్‌సి కోడ్‌లు
వినియోగించాల్సి ఉంటుంది. ఐఎఫ్‌ఎస్‌సి కోడ్ లను కెనరా బ్యాంక్ వెబ్‌సైట్ ద్వారా
పొందొచ్చు.
3. SBI Free
Transactions (ఉచిత లావాదేవీలు)
ప్రాథమిక పొదుపు బ్యాంకు డిపాజిట్
ఖాతా (బీఎస్‌బీడీ) కలిగిన ఖాతాదారుల లావాదేవీలపై జులై 1
నుంచి కొన్ని పరిమితులు విధించేందుకు ఎస్‌బీఐ సిద్ధమవుతోంది. ఈ ఖాతా ఉన్న వారు
బ్యాంకు శాఖలు, ఏటీఎంల నుంచి కూడా కలిపి నెలకు ఉచితంగా
నాలుగుసార్లు మాత్రమే నగదు తీసుకునే వీలుంటుంది. ఆపై ఒక్కో లావాదేవీపై రూ.15
(జీఎస్టీ అదనం) చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
4. Cheque Book Limit (చెక్కు
బుక్కుకూ లిమిట్)
చెక్కులు కూడా ఏడాదికి 10కి
మించితే భారం మోపేందుకు ఎస్‌బీఐ సిద్ధమైంది. 10 చెక్కుల
కొత్త చెక్కు పుస్తకం కోసం రూ.40, 25 చెక్కుల పుస్తకం కోసం రూ.75
(జీఎస్టీ అదనం) చెల్లించాల్సి ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు
దీన్నుంచి మినహాయింపు ఇచ్చింది.
5. LPG Price (ఎల్‌పీజీ
గ్యాస్ ధర)
లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్‌పీజీ)
లేదా కిచెన్ గ్యాస్ రేట్లు కూడా జూలై 1 నుండి సవరించనున్నారు. దీని
ధర సగటు అంతర్జాతీయ బెంచ్ మార్క్, విదేశీ మారక రేట్ల మార్పు
వంటి అంశాల ద్వారా నిర్ణయించబడుతుంది.
6. TDS Rules (టీడీఎస్
కొత్త రూల్స్)
ఇటీవల కేంద్రం అమల్లోకి తెచ్చిన
ఫైనాన్స్ యాక్ట్ 2021 ప్రకారం గత రెండేళ్లలో చెల్లించాల్సిన
టీడీఎస్, టీసీఎస్ పన్ను రూ.50,000
కంటే ఎక్కువగా ఉంటే వారి నుంచి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయంలో అధిక
శాతంలో పన్ను వసూలు చేయాలని ఆదాయపు పన్ను విభాగం నిర్ణయించింది. ఇది జులై 1 నుంచి అమల్లోకి రానుంది.
7. Old Cheque Books Invalid (చెక్కు బుక్కులు చెల్లవు)
మీరు ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ ఖాతాదారులా? అయితే ఇది మీ కోసమే. ఈ రెండు బ్యాంకులు యూనియన్ బ్యాంకులో విలీనం అయిన కారణంగా పాత చెక్కు బుక్కులు జులై 1 నుంచి చెల్లవ్. కొత్త చెక్కు బుక్కులు యూనియన్ బ్యాంకు శాఖల్లో తీసుకోవాల్సి ఉంటుంది.
8. Hero Vehicles Price Hike (‘హీరో’ ధరల పెంపు)
ద్విచక్ర వాహన ధరలు పెంచేందుకు
ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్ సిద్ధమవుతోంది. ముడి సరకు ధరలు
పెరగడంతో వాహన ధరలు పెంచుతున్నట్లు ఇది వరకే ఆ కంపెనీ వెల్లడించింది. పెరిగిన ధరలు
జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
0 Komentar