June-2021: Here Are the 8 Important
Things to Change in This Month
జూన్-2021: ఈనెల లో మారే ముఖ్యమైన 8 అంశాలివే
జూన్ నెలలోకి అడుగు పెట్టేశాం. ఈరోజు నుంచి కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. పలు అంశాలు మారబోతున్నాయి. బ్యాంక్స్, ఇన్‌కమ్ ట్యాక్స్, గూగుల్, ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ఇలా పలు అంశాలకు నిబంధనలు మారబోతున్నాయి. దీంతో ఈరోజు నుంచి ఏ ఏ అంశాలు మారబోతున్నాయో ముందే తెలుసుకోవడం ఉత్తమం.
1. Gas Cylinder Price:
గ్యాస్ సిలిండర్ వాడే వారు కూడా ఒక
విషయం గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా గ్యాస్ సిలిండర్ ధరలను
సవరిస్తూ ఉంటుంది. ఈసారి కూడా ఒకటో తేదీ సిలిండర్ ధరలు మారొచ్చు. లేదంటే స్థిరంగా
కూడా కొనసాగవచ్చు. ఈ రోజు గ్యాస్ సిలిండర్ ధర రూ. 122 తగ్గినట్లు సమాచారం.
2. ITR Web Portal:
ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్
వెబ్‌సైట్ పని చేయదు. ఆదాయపు పన్ను శాఖ కొత్త ఇపోర్టల్ తీసుకువస్తోంది. జూన్ 6
వరకు ఇఫైలింగ్ సైట్ అందుబాటులో ఉండదు. జూన్ 7 నుంచి కొత్త
ఇఫైలింగ్ వెబ్‌సైట్ అందుబాటులోకి వస్తుంది.
3. Google Storage:
గూగుల్ కొత్త రూల్స్
తీసుకువచ్చింది. గూగుల్ స్టోరేట్ రూల్స్ మార్చింది. గూగుల్ యూజర్లకు 15
జీబీ స్పేస్ మాత్రమే ఉచితంగా లభిస్తుంది. ఈ లిమిట్ దాటితే డబ్బులు చెల్లించాలి.
అంటే జీమెయిల్, గూగుల్ ఫోటోస్, గూగుల్
డ్రైవ్ వంటి వాటిల్లో మీరు 15 జీబీ స్పేస్ వరకు మాత్రమే
స్టోరేజ్ లభిస్తుంది. అంటే మీరు ఇకపై అన్‌లిమిటెడ్ ఫోటోలను అప్‌లోడ్ చేసుకోలేరు.
4. Bank of Baroda:
బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు ఒక విషయం తెలుసుకోవాలి. జూన్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి వస్తున్నాయి. చెక్ పేమెంట్స్‌కు సంబంధించి నిబంధనలు మారబోతున్నాయి. చెక్ ద్వారా చెల్లింపులు నిర్వహించే వారు కచ్చితంగా రీకన్ఫర్మేషన్ అందించాల్సి ఉంటుంది. లేదంటే బ్యాంక్ మీ చెక్‌ను క్లియర్ చేయదు.
5. Canara Bank (Syndicate Bank)
కెనరా బ్యాంక్ కస్టమర్లకు సంబంధించి కూడా రూల్స్ మారబోతున్నాయి. సిండికేట్ బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్లు జూన్ 30 తర్వాత పని చేయవు. అంటే జూలై 1 నుంచి కెనరా బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్లను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. లేదంటే ఆన్‌లైన్‌లో డబ్బులు పంపడం కుదరదు.
6. Gold:
బంగారం కొనుగోలు చేసే వారు ఒక
విషయం తెలుసుకోవాలి. అలాగే విక్రయించే వారు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
జూన్ 15 నుంచి గోల్డ్ హాల్ మార్కింగ్ రూల్స్ అమలులోకి వస్తున్నాయి. హాల్ మార్క్
ఉన్న బంగారానే కొనాలి. లేదంటే అమ్మాల్సి ఉంటుంది.
7. Flight Charges:
విమాన ప్రయాణం చేసే వారికి ఝలక్.
కేంద్ర ప్రభుత్వం లోయర్ లిమిట్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 13
నుంచి 16 శాతం పెంచేసింది. జూన్ 1
నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది. దీంతో విమాన ప్రయాణం భారం కానుంది. అయితే మోదీ
సర్కార్ అప్పర్ లిమిట్‌ను అలాగే స్థిరంగా కొనసాగించింది.
8. YouTube Tax:
యూట్యూబ్ వీడియోపై పన్ను: జూన్
నుండి,
మీరు యూట్యూబ్ ఆదాయాలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏదేమైనా,
యూట్యూబ్ యొక్క యుఎస్ కంటెంట్ సృష్టికర్తలకు పన్ను విధించబడదు కాని
భారతదేశంతో సహా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుండి కంటెంట్ సృష్టికర్తలు యూట్యూబ్
సంపాదనపై పన్ను చెల్లించాలి. అయినప్పటికీ, మీరు అమెరికన్
ప్రేక్షకుల నుండి స్వీకరించిన వీక్షణలకు మాత్రమే పన్ను చెల్లించాలి.
0 Komentar