కర్ణాటకలో బహుముఖ విద్యా ప్రణాళిక - సాంకేతిక ఉపకరణాల ఆధారంగా రూపకల్పన
కర్ణాటకలో 2021-22 ఏడాదికి పాఠశాల విద్యా ప్రణాళికను వినూత్నంగా రూపొందించారు. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థుల్లో సాంకేతిక ఉపకరణాలు లేని, ఉన్న వారిని రెండు విభాగాలుగా విభజిస్తారు. వారికి అనుగుణంగా నూతన పాఠ్య ప్రణాళిక అమలుకు సన్నద్ధమయ్యారు. 2020లో కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో ఆన్‌లైన్‌లోనే పాఠాలు బోధించారు.70 శాతానికి పైగా విద్యార్థులు ఆన్‌లైన్ బోధనను అందుకోలేకపోయినట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈ ఏడాదీ ఆఫ్‌లైన్ తరగతుల నిర్వహణ కష్టసాధ్యమన్న అంచనాతో నూతన పాఠ్య ప్రణాళికను తయారు చేసింది. దీని ప్రకారం జులై 1 నుంచి మొదలయ్యే విద్యా సంవత్సరం ప్రత్యేకతలిలా ఉన్నాయి.
* తల్లిదండ్రుల విద్యార్హతలు, టీవీతోపాటు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు. ఇలా సాంకేతిక ఉపకరణాలున్న వారిని- లేని వారిని రెండుగా విభజిస్తారు. ఈ ఉపకరణాలు లేని విద్యార్థుల పొరుగువారి మొబైల్ నంబర్లు సేకరిస్తారు. ఇలా విద్యార్థుల తల్లిదండ్రులు లేదా పొరుగువారి మొబైల్ నంబర్లతో ప్రత్యేక సామాజిక మాధ్యమ గ్రూపులను సిద్ధం చేస్తారు.
* మొబైల్, టీవీ లేని విద్యార్థులను పొరుగువారి ఇంట్లో టీవీ చూసే ఏర్పాటు చేస్తారు. వీరి మొబైల్ నంబరును విద్యార్థి పేరిట సేకరిస్తారు. దూరదర్శన్ ద్వారా వచ్చే పాఠాలను నిత్యం వీక్షించే విద్యార్థి అధ్యయన క్రమాన్ని వారానికి ఓ సారి సమీక్షిస్తారు. ఒక వేళ సాధారణ మొబైల్ ఉంటే అందులో ఎఫ్‌ఎం ద్వారా ప్రసారమయ్యే పాఠాలే విద్యార్థికి కీలకం కానున్నాయి. ఇలాంటి విద్యార్థులను ప్రతి గ్రామానికి 10-15 మందిని గుర్తించి ఒక మెంటార్‌ను నియమిస్తారు. ఆఫ్‌లైన్ తరగతులు మొదలు కాకుంటే ఈ విధానం ద్వారానే విద్యార్థుల చదువులపై మూల్యాంకనం చేస్తారు.
* స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో పాటు ఇంటర్నెట్ సదుపాయం ఉన్న విద్యార్థులకు ‘దీక్షా యాప్’లో
రూపొందించిన విద్యా విధానాన్ని అనుసరించేలా చేస్తారు.
0 Komentar