Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Man From Mizoram, With World's Largest Family, Dies at 76

 

Man From Mizoram, With World's Largest Family, Dies at 76

ప్రపంచంలో పెద్ద కుటుంబ యజమాని జియోన ఇకలేరు

39 మంది భార్యలు, 94 మంది పిల్లలు

ప్రపంచంలో అతిపెద్ద కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న జియోన చనా (76) శనివారం మృతిచెందగా, మిజోరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి జోరాంతంగ భారమైన హృదయంతో సంతాపం తెలిపారు. ‘మీ కుటుంబం కారణంగానే రాష్ట్రంలో పెద్ద పర్యాటక కేంద్రంగా మీ గ్రామం ఉండేది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి’ అని ట్వీట్‌ చేశారు. జియోన చనాకు 39 మంది భార్యలు, 94 మంది పిల్లలు, 33 మంది మనవలు, మనవరాళ్లు ఉన్నారు.

డయాబెటిస్‌, బీపీలతో బాధపడుతున్న జియోన మిజోరం రాజధాని ఆయ్‌జోల్‌లోని ట్రినిటీ ఆసుపత్రిలో మధ్యాహ్నం మూడింటికి మృతిచెందారు. స్వగ్రామం బక్తావంగ్‌ త్లాంగ్‌నామ్‌లోని చనాస్‌ వర్గానికి ఈయనే పెద్ద. 1945లో పుట్టిన జియోన పదిహేడేళ్ల వయసులో తనకంటే మూడేళ్లు పెద్ద అయిన మొదటిభార్యను వివాహం చేసుకున్నారు.

వంద గదులున్న నాలుగంతస్తుల భవనంలో ఈ కుటుంబం ఉంటుంది. విశ్రాంత గదులు వేరైనా అందరికీ వంటగది ఒక్కటే. జియోన పడకగదికి దగ్గరలోని డార్మెటరీలో ఆయన భార్యలు ఉండేవారు. కుటుంబ పోషణకు సరిపడా ఆర్థిక వనరులున్నా బయటి నుంచి కూడా విరాళాలు అందేవి.

Previous
Next Post »
0 Komentar

Google Tags