Microsoft Announces Windows 11 With Android App Support
మైక్రోసాఫ్ట్ విండోస్ 11 ఓఎస్ ఆవిష్కరణ
– 2015 లో విండోస్ 10 తర్వాత 6 ఏళ్లకు విండోస్ 11
దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థ
మైక్రోసాఫ్ట్ తన విండోస్ ఆపరేటింగ్ సిస్టం(ఓఎస్) శ్రేణిలో తదుపరి ఆవిష్కరణను
తీసుకొచ్చింది. వినియోగదారులను ఆకర్షించే సరికొత్త సదుపాయాలతో విండోస్ 11 ఓఎసన్ను
గురువారం వర్చువల్ విధానంలో ఆవిష్కరించింది. 2015లో విండోస్ 10ను విడుదల చేసిన
తరువాత మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిన కీలక ఆవిష్కరణ ఇదే. "వచ్చే పదేళ్ల వరకూ
వినియోగదారుల అవసరాలను తీర్చేలా దీన్ని రూపొందిస్తున్నాం . విండోస్ చరిత్రలో ఇదో
పెద్ద మైలు రాయి" అని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఈ సందర్భంగా
పేర్కొన్నారు.
విండోస్ 11లో స్టార్ట్ మెనూ
కొత్తగా ఉండబోతోంది. టాస్క్ బార్, ఫాంట్, ఐకాన్ల
విషయంలోనూ సరికొత్త అనుభూతిని అందించనుంది. ఈ ఓఎస్ ద్వారా తొలిసారిగా విండోస్..
ఆండ్రాయిడ్ యాప్ ను కూడా వినియోగించుకునే సదుపాయం అందించబోతోంది. ఈ ఏడాది చివరికల్లా
కొత్త కంప్యూటర్లతో పాటు విండోస్ 10 వినియోగదారులకు కొత్త ఓఎస్ ఉచితంగా
అందుబాటులోకి వస్తుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
0 Komentar