నాడు-నేడు పనులకు 20వ తేదీ తుది గడువు -మంత్రి ఆదిమూలపు సురేష్
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మనబడి
నాడు నేడు కార్యక్రమం మొదటి విడత పనులు ఈనెల 20 నాటికి పూర్తి
కావాల్సిందేనని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే
పలు మార్లు సమావేశాలు నిర్వహించి అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేశామని ఆయన
పేర్కొంటూ ఇంకా గడువు ఇచ్చే అవకాశాలు లేవని, రెండో విడత
పనులు ప్రారంభించాల్సి ఉందని మంత్రి కాన్ఫెరెన్స్ లో సురేష్ తెలిపారు. అధికారులతో శుక్రవారం
నిర్వహించిన వీడియో ఆయన మాట్లాడుతూ నాడు-నేడు పనుల్లో భాగంగా ప్రహరీల నిర్మాణం
తక్షణమే పూర్తి చేయాలన్నారు. ఇకపై జాప్యం జరిగితే కుదరదని ఆయన హెచ్చరించారు.
డెస్క్ లు, నీటి సరఫరా వస్తువులు పాఠశాలలకు చేర్చి 100
శాతం పూర్తి చేయాలని సూచించారు.
ప్రస్తుతం పాఠశాలలకు సెలవులు కావటం
పనులు వేగవంతానికి ఉపయోగం అని, సమయాన్ని సద్వినియోగం
చేసుకోవాలన్నారు. పెయింటింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. 14,971 పాఠశాలల్లో పెయింటింగ్ పనులకు గాను 82 శాతం పూర్తి
చేసినట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వాల్ రైటింగ్ పనులు కూడా
చేపట్టి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం రెండవ విడత నాడు నేడు పనుల
టెండర్ల ప్రక్రియ పై అధికారులతో సమీక్షించారు. రెండో విడతలో సివిల్ పనులకు
సంబంధించిన వాటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
0 Komentar