Nirmala Sitharaman asks Infosys to fix
glitches in new income tax e-filing portal
ఆదాయపు పన్ను వెబ్‌సైటులో లోపాలు సరిదిద్దండి - ఇన్ఫోసిస్‌కు ఆర్థిక మంత్రి సూచన
ఆదాయపు పన్ను విభాగం కొత్తగా
అందుబాటులోకి తీసుకొచ్చిన వెబ్‌సైట్‌లో పలు ఇబ్బందులు తలెత్తడంతో, ఆర్థిక
మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పలువురు పన్ను
చెల్లింపుదారులు ‘కొత్త వెబ్‌సైట్ సరిగా పనిచేయడం లేదని, లాగిన్
అవ్వలేకపోతున్నటు’్ల ట్విటర్‌లో ఆర్థిక మంత్రికి తెలిపారు. ‘అందరూ ఎంతగానో ఎదురు
చూస్తున్న ఇ-ఫైలింగ్ పోర్టల్ 2.0 సోమవారం రాత్రి 8.45 గంటల నుంచి అందుబాటులోకి వచ్చింది. అయితే ఇందులో కొన్ని లోపాలు, ఇబ్బందులు ఉన్నాయన్న ఫిర్యాదులతో నా టైమ్‌లైన్ నిండిపోయింది. వీటిని
వెంటనే సరిచేయాల్సిందిగా ఇన్ఫోసిస్, నందన్ నీలేకనిలను
కోరుతున్నాను. నాణ్యమైన సేవలు అందించడంలో వారు పన్ను చెల్లింపుదారులను
నిరుత్సాహానికి గురి చేయరని ఆశిస్తున్నా’ అంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు. పన్ను
రిటర్నులు దాఖలు చేయడం ఎంతో సులువుగా ఉండాలన్నదే తమ లక్ష్యమని మంత్రి తెలిపారు.
ఆదాయపు పన్ను శాఖకు కొత్త వెబ్‌సైట్ రూపొందించి, నిర్వహించే
కాంట్రాక్టును 2019లో ఇన్ఫోసిస్ దక్కించుకుంది. ఆదాయపు
పన్ను రిటర్నులను ప్రాసెస్ చేసే సమయాన్ని 63 రోజుల నుంచి ఒక
రోజుకు తగ్గించడం లక్ష్యంగా ఈ కొత్త www.incometax.gov.in పోర్టల్‌ను
ఆదాయపు పన్ను విభాగం అందుబాటులోకి తెచ్చింది.
కొత్త వెబ్‌సైటుపై ట్విటర్‌లో
వచ్చిన ఫిర్యాదులు ఎలా ఉన్నాయంటే..
* వెబ్‌సైట్ లాగిన్ కోసం
చాలా సమయం తీసుకుంటోంది.
* జీఎస్‌టీఎన్ పోర్టల్
తరహాలోనే ఇప్పుడూ జరిగింది. వెబ్‌సైట్‌ను పూర్తి స్థాయిలో పరీక్షించకుండానే
తీసుకొచ్చారు.
* మొబైల్ ఫోనుకు
తగ్గట్టుగా వెబ్‌సైట్ డిజైన్ చేయలేదు.
* వెబ్‌సైట్ అందుబాటులోకి
వచ్చి 24 గంటలు పూర్తయినా, ఇంకా సరిగా
పనిచేయడం లేదు.
* ఒకే రోజులో రిటర్నులు
ప్రాసెస్ చేయడంతో పాటు, వెంటనే రిఫండు రావడం ఎంతో హర్షణీయం.
చాట్‌బాట్ ట్యాక్స్‌జీని స్పందన బాగుందని మరికొందరన్నారు.
పరిష్కరిస్తున్నాం: నీలేకని
‘వెబ్‌సైట్‌లో తొలిరోజు
ఎదురైన సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామ’ని ఆర్థిక మంత్రికి
నీలేకని బదులిచ్చారు. వారంలో అంతా సర్దుకుంటుందని తెలిపారు.
ITR: ఇ-ఫైలింగ్ 2.0 పోర్టల్ కొత్త సదుపాయాలు ఇవే
The much awaited e-filing portal 2.0 was launched last night 20:45hrs.
— Nirmala Sitharaman (@nsitharaman) June 8, 2021
I see in my TL grievances and glitches.
Hope @Infosys & @NandanNilekani will not let down our taxpayers in the quality of service being provided.
Ease in compliance for the taxpayer should be our priority. https://t.co/iRtyKaURLc
0 Komentar