Optional Exams for Class 12 To Be Held
Between Aug 15-Sep 15: CBSE to SC
జులై 31లోపు
12వ తరగతి ఫలితాలు - సుప్రీంకు తెలిపిన
సీబీఎస్‌ఈ, సీఐఎస్‌సీఈ
సంతృప్తి చెందని విద్యార్థులకు
ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 మధ్యలో ఆప్షనల్ పరీక్షలు
పన్నెండో తరగతి పరీక్ష ఫలితాలను
జులై 31లోపు విడుదల చేస్తామని సీబీఎస్‌ఈ. సీఐఎస్‌సీఈ బోర్డులు సోమవారం సుప్రీం
కోర్టుకు తెలిపాయి. విద్యార్థుల ప్రతిభను అంచనా వేసే మూల్యాంకన విధానంలో వివాద
పరిష్కార యంత్రాంగాన్ని చేర్చినట్లు సర్వోన్నత న్యాయస్థానం ముందు ప్రమాణపత్రం
దాఖలు చేశాయి. ఫలితాలపై అభ్యంతరాలున్న విద్యార్థుల కోసం ప్రత్యేక కమిటీని
నియమిస్తామని సీబీఎస్‌ఈ తెలిపింది.
కమిటీ నిర్ణయంతో కూడా సంతృప్తి
చెందని విద్యార్థులకు ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 మధ్యలో ఆప్షనల్ పరీక్షలు (ప్రధాన సబ్జెక్టులు మాత్రమే) నిర్వహిస్తామని
ప్రమాణ పత్రంలో పేర్కొంది. ప్రైవేటు, కంపార్ట్‌మెంట్
పరీక్షలు రాసే విద్యార్థుల మూల్యాంకనంపై కూడా సీబీఎస్‌ఈ వివరణ ఇచ్చింది. 2019-20 సంవత్సరంలో కోర్టు ఆమోదించిన విధానంలోనే మదింపు ఉంటుందని వెల్లడించింది.
సీబీఎస్‌ఈ తరహాలోనే వివాద పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేశామని చెప్పిన సీఐఎస్‌సీఈ, పరిస్థితులు మెరుగైతే సెప్టెంబర్ ఒకటి నుంచి ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు
నిర్వహిస్తామని పేర్కొంది.
0 Komentar