Govt Fixes Revised Prices for
Covishield, Covaxin and Sputnik at Private Hospitals
ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ధరలు ఖరారు - కేంద్రం ప్రకటన
ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా
వ్యా్క్సిన్‌ను మితిమీరిన ధరలకు వేయకుండా కేంద్ర ప్రభుత్వం వాటి ధరలపై స్పష్టత
ఇచ్చింది. ఏయే వ్యాక్సిన్ ఎంత ధరకు వేయాలనే వివరాలను ప్రకటించింది. తాజాగా కేంద్రం
నిర్దేశించిన ధరల ప్రకారం.. కొవిషీల్డ్ వ్యాక్సిన్ ధర గరిష్ఠంగా రూ.780కు
ఇవ్వాల్సి ఉంటుంది. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన
కొవాగ్జిన్ వ్యాక్సిన్‌ను రూ.1410, రష్యాకు చెందిన
స్పుత్నిక్-వి టీకాను రూ.1145 ధరల చొప్పున వసూలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
అయితే, అన్ని
పన్నులు కలుపుకొని, చివరికి ఆస్పత్రులు వసూలు చేస్తున్న
రూ.150 సర్వీస్ ఛార్జి కూడా ఈ ధరల్లో కలిపి ఉండాలని కేంద్రం స్పష్టంచేసింది. అధిక
ఛార్జీలు వసూలు చేసే ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర
ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా 18 ఏళ్లు దాటిన
అందరికీ ఉచితంగా టీకా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించిన సంగతి
తెలిసిందే. ఉచితంగా వ్యాక్సిన్ వద్దనుకొనేవారి కోసం 25 శాతం వ్యాక్సిన్‌లను
ప్రైవేటు ఆస్పత్రులకు ఇస్తున్నట్టు ప్రధాని మోదీ సోమవారం జాతినుద్దేశించి
ప్రసంగించారు.
0 Komentar