M-Yoga Mobile App in Collabration with WHO – Know the Details
mYoga App: WHO సహకారంతో ఎమ్-యోగా
మొబైల్ యాప్
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఎమ్-యోగా పేరిట ఒక మొబైల్ యాప్‌ను పరిచయం చేశారు. దీనిద్వారా ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో యోగా శిక్షణ వీడియోలను విడుదల చేస్తున్నట్లు మోదీ వెల్లడించారు. యోగాను విశ్వవ్యాప్తం చేసేందుకు ఈ యాప్ ఉపకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
‘ప్రపంచ ఆరోగ్యసంస్థ సహకారంతో భారత్ మరో అడుగువేసింది. రెండూ కలిసి ఎమ్-యోగా యాప్‌ను తీసుకువచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో యోగా శిక్షణ వీడియోలు దీని ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రాచీన శాస్త్రాల కలయికకు ఈ యాప్ ఒక ఉదాహణగా నిలువనుంది’ అని ఈ యోగ దినోత్సవాన చేసిన ప్రసంగంలో మోదీ ప్రస్తావించారు.
యోగాను తమ జీవనశైలిలో భాగం చేసుకోవాలని ఆశించే వారికి ఈ యాప్ ఉపకరించనుంది. ఇంటి వద్దే సులభంగా యోగాసనాలు వేసేందుకు వీలుగా వీడియోలు, ఆడియో ప్రాక్టీస్ సెషన్లను అందించనుంది. 12 నుంచి 65ఏళ్ల మధ్య వయస్కులు దీన్ని వినియోగించవచ్చు. యోగాసనాలు సాధనచేసే సమయంలో ఇది వారికి సహచరిగా ఉండనుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ యాప్ రూపకల్పనలో పాల్గొన్నాయి. అలాగే అంతర్జాతీయంగా పలువురు నిపుణుల అభిప్రాయాలను సేకరించారు. మరోపక్క వినియోగదారుల గోప్యతకు ఈ యాప్ అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఇది వారి నుంచి ఎటువంటి సమాచారాన్ని సేకరించదు. ప్రస్తుతం ఎమ్-యోగా యాప్ ఇంగ్లిష్, హిందీ, ఫ్రెంచ్ భాషల్లో అందుబాటులో ఉంది. రానున్న నెలల్లో ఐరాస గుర్తించిన భాషల్లో దీన్ని తీసుకురానున్నారు.
0 Komentar