ఇక ఏ డీలర్ నుంచైనా గ్యాస్ – ఇష్టం
వచ్చిన వారి దగ్గర బుక్ చేసుకునే వీలు
5 నగరాల్లో ప్రయోగాత్మకంగా అమలు
కంపెనీని మార్చకుండా డీలరును ఎంచుకునే సౌలభ్యం వంట గ్యాస్ వినియోగదారులకు కలగనుంది. గ్యాస్ సిలిండర్ బుకింగ్ పోర్టబిలిటీని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం వినియోగదారుడు ఏ డిస్టిబ్యూటర్ దగ్గర గ్యాస్ కనెక్షన్ తీసుకొని ఉంటే వారి దగ్గరే సిలిండర్ బుక్ చేసుకోవాల్సి ఉంది. కానీ ఇక ముందు వినియోగదారుడు తనకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్ నుంచి బుక్ చేసుకొనే వెసులుబాటును కేంద్ర పెట్రోలియం శాఖ అందుబాటులోకి తెస్తోంది. ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తొలుత చండీగఢ్, కోయంబత్తూరు, గురుగ్రాం, పుణే, రాంచీ నగరాల్లో అమలు చేయనుంది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే ఈ నూతన విధానం లక్ష్యం.
అమలు విధానం....👇👇
* వినియోగదారుడు తన రిజిష్టర్డ్
ఐడీ ద్వారా లాగిన్ అయి మొబైల్ యాప్, కస్టమర్ పోర్టల్ నుంచి
గ్యాస్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు డిస్ట్రిబ్యూటర్ల పనితీరును
చాటిచెప్పే రేటింగ్స్ ను సూచిస్తూ ఒక జాబితా ప్రత్యక్షమవుతుంది.
* రీఫిల్ బుకింగ్ కు అందులో మంచి
రేటింగ్స్ ఉన్న డిస్టిబ్యూటర్‌ను ఎంచుకొనే స్వేచ్ఛ వినియోగదారుడికి ఉంటుంది.
* చమురు సంస్థల పోర్టళ్లు, మొబైల్
యాప్ ద్వారా వినియోగదారులు సిలిండర్ బుక్ చేసుకోవడంతోపాటు, వ్యక్తిగత
రికార్డులను నవీకరించుకోవచ్చు .
* డిజిటల్ మార్గంలోనే
పోర్టబిలిటీకి దరఖాస్తు చేయొచ్చు
* కనెక్షన్ బదిలీ, చిరునామా
మార్పు, రీఫిల్ కు సంబంధించిన ఇతరత్రా సేవలు పోర్టల్,
యాప్ ద్వారా కొనసాగించవచ్చు. * ఒకే ప్రాంతంలో ఒక డిస్ట్రిబ్యూటర్
నుంచి మరో డిస్ట్రిబ్యూటరకు కనెక్షన్ ను ఆన్ లైన్ ద్వారా బదిలీ చేసుకోవచ్చు .
* వినియోగదారుడు రిజిష్టర్డ్
లాగిన్ ద్వారా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల జాబితాలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లలో ఎవర్నో
ఒకర్ని ఎంచుకొని తమ కనెక్షన్‌ను అక్కడికి మార్చుకోవచ్చు . ,
* ఇదే సమయంలో వినియోగదారుడు వదిలి
వెళ్లిపోకుండా వారికి నచ్చజెప్పే అవకాశం కూడా డిస్ట్రిబ్యూటర్కు ఉంటుంది. ఒకవేళ
వినియోగదారుడు సంతృప్తి చెందితే తమ పోర్టబిలిటీ దరఖాస్తును మూడు రోజుల్లోపు
ఉపసంహరించుకోవచ్చు. లేదంటే కనెక్షన్ ఆటోమేటిక్ గా వినియోగదారుడు ఎంచుకున్న డిస్టిబ్యూటర్
కు బదిలీ అయిపోతుంది.
* వినియోగదారుడు డీలరు
కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే తమ ప్రాంతంలో ఉన్న డిస్ట్రిబ్యూటర్ (ఒకే
కంపెనీకి చెందినవారు)ని ఎంచుకోవచ్చు .
* ఈ సేవలు పూర్తిగా ఉచితమే.
0 Komentar