55% ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ ఇవ్వాలి - సీఎంకు ఏపీఎన్జీవో సంఘం విజ్ఞప్తి
ప్రభుత్వ ఉద్యోగులకు 11వ
పీఆర్‌సీని 55 శాతం ఫిట్‌మెంట్‌తో 2018
జులై 1 నుంచి ఇవ్వాలని కోరగా.. సీఎం జగన్ సానుకూలంగా
స్పందించారని, త్వరలోనే వేతన సవరణను అమలు చేస్తామని హామీ
ఇచ్చారని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. సీపీఎస్‌పై
మంత్రుల బృందం ఇచ్చిన నివేదికను పరిశీలిస్తామని, ఉద్యోగ సంఘ
నాయకులతో చర్చించి తగిన న్యాయం చేస్తామని సీఎం చెప్పినట్లు వివరించారు.
బుధవారం తాడేపల్లిలోని క్యాంపు
కార్యాలయంలో సీఎంను కలిసి ఉద్యోగుల సమస్యలపై వినతిపత్రం అందించినట్లు చంద్రశేఖర్‌రెడ్డి
ఒక ప్రకటనలో తెలిపారు. ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరినట్లు
వివరించారు. ‘2008 డీఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థుల తరహాలోనే 1998 డీఎస్సీ అభ్యర్థులకు అవకాశమివ్వాలి. నాలుగో తరగతి ఉద్యోగుల పదవీ విరమణ
వయసును రెండేళ్లు పెంచాలి’ అని కోరినట్లు తెలిపారు.
తమ విజ్ఞప్తులపై సీఎం సానుకూలంగా
స్పందించారని, ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు
వివరించారు. ఏపీఎన్జీవో సంఘం ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు, ఇతర నేతలు ఆయన వెంట ఉన్నారు.
Read this article also 👇
త్వరలో
పీఆర్సీ (PRC): NGO ఉద్యోగ
సంఘ నాయకులతో AP ముఖ్యమంత్రి
0 Komentar