ప్రీప్రైమరీ-1, 2కు
బోధించేవారు జూనియర్ ఎస్జీటీలే
పాఠశాల విద్యలో తీసుకొస్తున్న
సంస్కరణల్లో భాగంగా ఉపాధ్యాయుల పదోన్నతులపై పాఠశాల విద్యాశాఖ స్పష్టతనిచ్చింది.
ప్రీప్రైమరీ-1, 2కు బోధించే వారిని జూనియర్ ఎస్జీటీలుగా
పేర్కొననున్నారు. వీరికి విద్యార్హత ఇంటర్మీడియట్ సరిపోతుంది. ఉపాధ్యాయుల్లో సీనియర్..
ప్రధానోపాధ్యాయుడిగా ఉంటారు.
ఒకటో తరగతికి సన్నద్ధత, ఒకటి,
రెండు తరగతులకు బోధించేవారిని సీనియర్ ఎస్జీటీలుగా పిలుస్తారు.
వీరికి ఇంటర్‌తోపాటు టీటీసీ అర్హత ఉండాలి. 3, 4, 5 తరగతులకు బోధించే స్కూల్ అసిస్టెంట్లను జూనియర్ స్కూల్ టీచర్‌గా
భావిస్తారు. వీరికి డిగ్రీ, బీఈడీ అర్హత ఉండాలి. వీరిలో
సీనియర్ ఉపాధ్యాయులు గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులుగా వ్యవహరిస్తారు.
6, 7, 8 తరగతులకు బోధించే స్కూల్ అసిస్టెంట్లను సీనియర్ స్కూల్ టీచర్‌గా
పేర్కొంటారు. వీరికి డిగ్రీ, బీఈడీ అర్హత తప్పనిసరి. సీనియర్
ఉపాధ్యాయులు గ్రేడ్-1 ప్రధానోపాధ్యాయులుగా ఉంటారు. 9, 10,
11, 12 తరగతులకు బోధించే వారిని
పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ)గా పిలుస్తారు. వీరికి పోస్టుగ్రాడ్యుయేషన్
(పీజీ)తోపాటు బీఈడీ ఉండాలి. ప్రిన్సిపల్ ఉంటారు. పీజీటీ, గ్రేడ్-2
ప్రధానోపాధ్యాయుల కేడర్ సమానంగా ఉంటుంది. వీరికి పోస్టుగ్రాడ్యుయేషన్ తప్పనిసరి.
జూనియర్ ఎస్జీటీ, సీనియర్
ఎస్జీటీ, జూనియర్ స్కూల్ టీచర్, సీనియర్
స్కూల్ టీచర్, గ్రేడ్-1, 2
ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పిస్తారు. జూనియర్ స్కూల్ టీచర్ (ఎస్‌టీ),
సీనియర్ ఎస్‌టీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్, సీనియర్ లెక్చరర్, ప్రిన్సిపల్ స్థాయి వరకు పదోన్నతులు ఇస్తారు.
0 Komentar