Reliance Jio New Prepaid Plan Launched with
3GB Per Day
JIO: జియో కొత్త ప్రీపెయిడ్
ప్లాన్ - రోజులో 3జీబీ డేటా పరిమితి –
వివరాలు ఇవే
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం మరో సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏడాది పాటు కాలపరిమితి ఉండే ఈ ప్లాన్ రూ.3,499కి లభించనుంది. ఈ ప్లాన్ తీసుకుంటే రోజుకు 3జీబీ డేటా చొప్పున మొత్తం 1095జీబీ 4జీ డేటాను పొందవచ్చు. రోజులో 3జీబీ డేటా పరిమితి పూర్తయిన తర్వాత నెట్ వేగం 64కేబీపీఎస్‌కు పడిపోతుంది. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా లభిస్తాయి. మరిన్ని వివరాలను జియో యాప్, వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
అంతేకాదు, ఈ
ప్లాన్ కింద వివిధ జియో యాప్స్‌ను వినియోగించుకోవడంతో పాటు, ఏడాది కాలపరిమితి గల డిస్నీ+హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా
లభించనుంది. జియో టీవీ, జియో సినిమా, జియో
న్యూస్, జియో సెక్యురిటీ, జియో క్లౌడ్
ప్రయోజనాలు పొందవచ్చు. ఏడాది కాలపరిమితి కలిగి రోజుకు 3జీబీ
డేటా అందించే విధంగా ఇప్పటివరకూ జియో ఎలాంటి ప్లాన్‌లను తీసుకురాలేదు. అయితే రూ.999 పథకం ద్వారా రోజుకు 3జీబీ డేటాను 84 రోజులు, రూ.401 ప్రీపెయిడ్
ప్లాన్‌తో 28 రోజుల పాటు 90జీబీ(రోజుకు
3జీబీ) డేటాను జియో అందిస్తోంది. ఈ పథకాల కాలపరిమితి కలిగిన
రోజులకు డిస్నీ+ హాట్ స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
వినాయకచవితి నాటికి అతి తక్కువ ధరకే 4జీ స్మార్ట్‌ఫోన్ జియో
నెక్స్ట్‌ను తీసుకురానున్నట్లు ఇటీవల జరిగిన 44వ ఏజీఎం
సమావేశంలో ముఖేశ్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
0 Komentar