SBI Doorstep Banking: How to Register and
List of Services
ఎస్‌బీఐ ఇంటి వద్దకే బ్యాంకింగ్
సేవలు –
వివరాలు ఇవే
ఆన్‌లైన్ బ్యాంకింగ్‌తో.. బ్యాంకు
చేతిలో ఉన్నట్లుగా మారిపోయినా.. కొన్ని తప్పనిసరి సందర్భాల్లో బ్యాంకు శాఖకు
వెళ్లాల్సి వస్తోంది. ఇప్పుడు ఆ ఇబ్బందీ లేకుండా.. బ్యాంకుకు నేరుగా రాలేని
వారికోసం ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలు
అందుబాటులోకి తెచ్చింది. ఇంతవరకూ కొంతమంది ప్రైవేటు బ్యాంకు ఖాతాదారులకే ఇంటి వద్ద
బ్యాంకింగ్ సేవలు లభించేవి. ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకులూ ఇలాంటి సేవలను
ప్రారంభించడం విశేషం.
> కేవైసీ పత్రాల
సమర్పరణ.. వంటి సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాల కోసం బ్యాంకు శాఖను
సంప్రదించాల్సిన అవసరం లేదు. మీకు సహాయం చేసేందుకు బ్యాంకు నియమించిన సిబ్బందితో
మీ ఇంటి వద్దే బ్యాంకింగ్ సౌకర్యాలు లభిస్తాయి.
నగదు లావాదేవీలూ..
నగదు ఉపసంహరణ సదుపాయాన్ని
పొందేందుకు ఖాతాదారు బ్యాంకు ఖాతాను ఆధార్ లేదా డెబిట్ కార్డుతో అనుసంధానించాలి.
లావాదేవీ పరిమితిని కనిష్ఠంగా రూ.1,000.. గరిష్ఠంగా రూ.20,000లుగా నిర్ణయించారు. సేవా రుసుము కింద ఆర్థికేతర లావాదేవీలకు రూ.60+జీఎస్టీ, ఆర్థిక లావాదేవీలకు రూ.100+జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
సేవలు ఎలా?
వినియోగదారుల సేవా కేంద్రాన్ని 18001037188,
180012113721 నెంబర్లలో సంప్రదించవచ్చు. లేదా ఎస్‌బీఐ అధికారిక యాప్,
డీఎస్‌బీ (డోర్‌స్టెప్ బ్యాంకింగ్) యాప్, వెబ్‌సైట్లోగానీ
రిజిస్టర్ చేసుకొని ఖాతాదారులు వారి ఇంటి వద్దనే బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు.
లేదా హోం బ్రాంచికి నేరుగా వెళ్లి దరఖాస్తు సమర్పించాలి. ఖాతాకు మొబైల్ నెంబర్
తప్పనిసరిగా అనుసంధానించాలి. ఖాతాదారులు కోరిన సేవలను టీ+1(లావాదేవీ
జరిగిన తేదీ) పనిదినాల్లో ముగించేస్తారు.
ఎవరు అర్హులు?
70 ఏళ్ల వయసు దాటిన సీనియర్
సిటిజన్లు, దివ్యాంగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
దేశవ్యాప్తంగా ఈ డీఎస్‌బీ సేవలను అందిస్తోంది. కేవైసీ పూర్తి చేసిన ఖాతాలు,
హోమ్ బ్రాంచీ నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఖాతాదారులు ఈ
సేవలను పొందే అవకాశం ఉంది. ఈ సేవలు మైనర్లు, ఉమ్మడి ఖాతాదారులకు
మాత్రం అందుబాటులో లేవు.
Your bank is now at your doorstep. Register for doorstep banking today!
— State Bank of India (@TheOfficialSBI) June 19, 2021
To know more: https://t.co/m4Od9LFR3G
Toll-Free no. 1800 1037 188 or 1800 1213 721#DoorstepBanking #DSB #Banking #StayAtHome #SBIAapkeSaath pic.twitter.com/Fr81GwcdL6
0 Komentar