ఘంటసాల గారి కుమారుడు డబ్బింగ్
ఆర్టిస్ట్ రత్నకుమార్ కన్నుమూత
సుప్రసిద్ధ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో కుమారుడు రత్నకుమార్ కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయనకు రెండు రోజుల క్రితమే నెగటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధింత సమస్యలతో ఇబ్బందిపడుతున్నారని, డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారని కుటుంబసభ్యులు తెలిపారు.
ఘంటసాల కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రత్నకుమార్, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా దక్షిణాది భాషల్లోనే కాకుండా హిందీలోనూ తెరకెక్కిన దాదాపు 1200 చిత్రాలకు తన వాయిస్ అందించారు. ఎనిమిది గంటలపాటు ఏకధాటిగా డబ్బింగ్ చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ ఆయన స్థానం సంపాదించుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఇప్పటివరకూ ఆయన వెయ్యికి పైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. ‘వీరుడొక్కడే’, ‘ఆట ఆరంభం’, ‘అంబేడ్కర్’ చిత్రాలతో పాటు దాదాపు 30 సినిమాలకు ఆయన మాటలు కూడా అందించారు.
రత్నకుమార్ గారు డబ్బింగ్ చెప్పిన ప్రసిద్ధ హీరోలు
వీరే
1. వినోద్ కుమార్
2. అరవింద్ స్వామి
3. కార్తీక్
4. మోహన్
5. షారూఖ్ ఖాన్
6. సల్మాన్ ఖాన్
ఈ క్రింది వీడియో చూస్తే ఖచ్చితం గా
ఆ గొంతు గుర్తు పడతారు
0 Komentar