Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

South African Woman Claims She Gave Birth To 10 Babies at Once, Breaking World Record

 

South African Woman Claims She Gave Birth To 10 Babies at Once, Breaking World Record

ఒకే కాన్పులో 10 మంది జననం -  గిన్నిస్‌ రికార్డుల్లోకి ఆఫ్రికా వండర్ ఉమెన్ 

ఒకే కాన్పులో 10 మంది జననం

ఏడుగురు మగ శిశువులు, ముగ్గురు ఆడ శిశువులు

ఒకే కాన్పులో ముగ్గురు నలుగురు పిల్లలు పుడితేనే ఆశ్చర్యపోతుంటాం.. కానీ దక్షిణాఫ్రికాకు చెందిన ఓ మహిళ ఏకంగా ఒకే కాన్పులో 10 మంది పిల్లలకు జన్మనిచ్చి రికార్డు నెలకొల్పింది. తాను ఒకే కాన్పులో 10 మంది పిల్లలకు జన్మనిచ్చినట్లు దక్షిణాఫ్రికాకు చెందిన గొసియామీ థామర సిట్‌హోల్‌ (37) అనే మహిళ ప్రకటించింది. 

ప్రిటోరియా నగరంలో సోమవారం రాత్రి తన భార్యకు సిజేరియన్‌ (సి–సెక్షన్‌) ద్వారా ప్రసవం జరిగిందని, ఏడుగురు మగ శిశువులు, ముగ్గురు ఆడ శిశువులు జన్మించారని ఆమె భర్త టెబోగో సోటెట్సీ చెప్పారు. 

తన భార్య గర్భం దాల్చి 7 నెలల 7 రోజులైందని, నెలలు నిండకుండానే 10 మందికి జన్మనిచ్చిందని టెబోగో సోటెట్సీ తెలిపాడు. తనకు చాలా ఆనందంగా ఉందని, ప్రస్తుతం ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనంటూ భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఒకే కాన్పులో 10 జన్మించారని దంపతులు చెబుతున్న విషయాన్ని వైద్యులు ఇంకా ధ్రువీకరించలేదు. ఒకవేళ ఇదే నిజమైతే ఒకే కాన్పులో ఇంతమంది పిల్లలు పుట్టడం ప్రపంచంలో ఇదే మొదటిసారి అవుతుందని చెబుతున్నారు. సిట్‌హోల్‌ గతంలోనూ కవలలకు జన్మనిచ్చింది. 

అయితే కృత్రిమ గర్భధారణ కోసం చేసే ట్రీట్‌మెంట్ల వల్లే ఇలా ఎక్కువ మంది శిశుశులు జన్మిస్తారని వైద్య నిపుణులు చెబుతున్నారు. గర్భం దాల్చే అవకాశాలను పెంచడానికి ఫలదీకరణ చెందిన అండాలను ఎక్కువ మొత్తంలో మహిళల గర్భాశయంలో ప్రవేశపెడుతుంటారని, అవి సక్రమంగా పెరిగి ఎక్కువ మంది శిశువులు జన్మిస్తారని అంటున్నారు. తన గర్భంలో ఆరుగురు శిశువులు ఉన్నట్లు వైద్యులు చెప్పారని, తర్వాత స్కానింగ్‌ చేయిస్తే 8 మంది ఉన్నట్లు తేలిందని సిట్‌హోల్‌ వివరించింది. అయితే ఆమె అంతకుమించి ఏకంగా 10 మందికి జన్మనిచ్చింది.

అద్భుతమైన వింత:  ఒకే కాన్పులో 9 మందికి జన్మనిచ్చిన మహిళ

Previous
Next Post »
0 Komentar

Google Tags