Syndicate Bank IFSC Code Will Change from
July 1
Canara Bank-Syndicate Bank: వచ్చే నెల నుంచి కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు – వివరాలు ఇవే
సిండికేట్ బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సి కోడ్‌లు, చెక్‌బుక్‌లు వచ్చే నెల నుంచి చెల్లవని కెనరా బ్యాంక్ వినియోగదారులకు ఇప్పటికే తెలియజేసింది. సిండికేట్ బ్యాంక్ కస్టమర్లు తమ బ్యాంక్ బ్రాంచ్ ఐఎఫ్ఎస్‌సి కోడ్‌ను జూన్ 30 లోగా అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెఫ్ట్/ఆర్టీజీఎస్/ఐఎంపీఎస్ మార్గాల ద్వారా నగదు లావాదేవీలకు ఇకపై కెనరా బ్యాంక్ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ప్రభుత్వరంగ బ్యాంకుల విలీన ప్రక్రియలో భాగంగా సిండికేట్ బ్యాంక్.. కెనరా బ్యాంక్‌లో విలీనం అయిన సంగతి తెలిసిందే. దీంతో కెనరా బ్యాంక్ నాలుగో అతిపెద్ద బ్యాంక్‌గా అవతరించింది.
పాత ఎమ్ఐసిఆర్, ఐఎఫ్ఎస్‌సి లతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇ-సిండికేట్ బ్యాంక్ చెక్ బుక్ కూడా జూన్ 30, 2021 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. అందువల్ల థర్డ్ పార్టీకి జారి చేసిన ఇ-సిండికేట్ చెక్‌బుక్ లేదా చెక్‌లు జూన్ 30,2021వ తేది తరువాత చెల్లవు. కాబట్టి వాటి స్థానంలో కొత్త వాటిని జారీ చేయాలని కెనరా బ్యాంక్ వినియోగదారలను కోరింది.
కొత్త ఐఎఫ్ఎస్‌సి కోడ్‌లు..
కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు 'సీఎన్ఆర్‌బి'
తో ప్రారంభవుతాయి. 'ఎస్‌వైఎన్‌బీ' ప్రారంభమయ్యే కోడ్ ఇకపై పనిచేయవు. పాత కోడ్ స్థానంలో వచ్చిన మీ బ్యాంక్
బ్రాంచ్ కొత్త ఐఎఫ్ఎస్‌సి కోడ్ వివరాలను
కెనరా బ్యాంక్ అందుబాటులో తీసుకొచ్చిన లింక్ క్రింద ఇవ్వబడినది. 'ఎస్‌వైఎన్‌బి'తో ప్రారంభమయ్యే మీ బ్రాంచ్ ఐఎఫ్ఎస్‌సి
కోడ్ ఎంటర్ చేసి క్లిక్ హియర్ టు గెట్ న్యూ ఐఎఫ్ఎస్‌సి పై క్లిక్ చేస్తే మీ
బ్యాంక్ బ్రాంచ్‌కి సంబంధించిన కొత్త కోడ్ అక్కడ చూపిస్తుంది. ఏదైనా కెనరా
బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించడం ద్వారా కూడా ఐఎఫ్ఎస్‌సి కోడ్ వివరాలు తెలుసుకోవచ్చు. లేదా కెనరా బ్యాంక్ కస్టమర్ కేర్ నెంబరు 18004250018 ను సంప్రదించి కూడా వివరాలు పొందవచ్చు.
CLICK HERE FOR CANARA BANK IFSC
స్విఫ్ట్ కోడ్..
సిండికేట్ బ్యాంక్ కస్టమర్లు విదేశీ మారక లావాదేవీల కోసం ఉపయోగిస్తున్న ప్రస్తుత స్విఫ్ట్(SWIFT) కోడ్‌ను నిలిపివేస్తున్నట్లు కెనరా బ్యాంక్ ప్రకటించింది.
"విదేశీ మారక లావాదేవీల కోసం స్విఫ్ట్ సందేశాలను పంపడం లేదా స్వీకరించడం కోసం గతంలో ఉపయోగించిన సిండికేట్ బ్యాంక్ (SYNBINBBXXX) స్విఫ్ట్ కోడ్ జూలై 1, 2021 నుంచి నిలిచిపోనుంది. విదేశీ ఎక్స్‌ఛేంజ్ అవసరాల కోసం ఆ స్థానంలో (CNRBINBBFD) ను ఉపయోగించవచ్చు.
ఐఎఫ్ఎస్‌సీ కోడ్ అంటే ఏమిటి?
ఐఎఫ్ఎస్‌సీ (ది ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్) అనేది ఒక ప్రత్యేకమైన 11-అంకెల ఆల్ఫాన్యూమరిక్(ఆంగ్ల అక్షరాలు అంకెలతో మిళితమైన) కోడ్, ఇది నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, ఐఎమ్‌పీఎస్ ద్వారా జరిగే ఆన్‌లైన్ ఫండ్ బదిలీ లావాదేవీలకు ఉపయోగించబడుతుంది.
ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు ఎందుకు
మారుతున్నాయి?
మెగా విలీన ప్రక్రియలో భాగంగా10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా మారుస్తున్నట్లు 2019లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అంటే ఏప్రిల్ 1,2021 నుంచి ఐఎఫ్ఎస్‌సీ, ఎమ్ఐసీఆర్ కోడ్‌లను కూడా బ్యాంకులు అప్‌డేట్ చేయడం ప్రారంభించాయి. దీనిలో భాగంగా ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకుల ఐఎఫ్ఎస్‌సీ కోడ్ మారుతున్నాయని, కొత్త కోడ్‌లను అప్‌డేట్ చేసుకోవాలని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. త్వరలోనే విలీనం అయిన మిగిలిన బ్యాంకుల కోడ్‌లు మారుతాయి. అయితే బ్యాంకులు ప్రకటించేవరకు పాత ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లనే వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు.
0 Komentar