Teacher Eligibility Test (TET) Pass
Certificate Valid for Lifetime: Government
ఇక టెట్ చెల్లుబాటు జీవితకాలం – ప్రకటించిన
ప్రభుత్వం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) పై
కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. టెట్ అర్హత సర్టిఫికెట్ గడువును ఏడు
సంవత్సరాల నుంచి జీవిత కాలానికి పొడిగిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖమంత్రి రమేశ్
పోఖియాల్ ప్రకటించారు. 2011 నుంచి ఇది వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే
ఏడేళ్ల కాలం గడిచిన అభ్యర్థులకు తాజాగా టెట్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి రాష్ట్రాలు
చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయ వృత్తిలో మరిన్ని ఉద్యోగాల కల్పనే
ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా
చేరడానికి టెట్ తప్పనిసరి చేస్తూ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్(ఎన్‌సీటీఈ)
2011లో ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వాలు టెట్ పరీక్షను
నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు టెట్ సర్టిఫికెట్ గడువు ఏడేళ్ల వరకే ఉండగా.. తాజాగా
జీవితకాలం పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
0 Komentar