TS: ఈనెల 7న 19 జిల్లాల్లో ప్రభుత్వ డయాగ్నొస్టిక్ కేంద్రాలు ప్రారంభం
రాష్ట్రంలోని 19 జిల్లా కేంద్రాల్లో డయాగ్నొస్టిక్ కేంద్రాలను ఈనెల 7న ప్రారంభించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వైద్య సేవలు, పలు అంశాలపై ప్రగతిభవన్ నుంచి అధికారులతో చర్చించిన సీఎం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
రోగం కంటే పరీక్షల ఖరీదే
ఎక్కువైందని ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి వేలకు
వేలు ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొందని అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఉచిత వైద్యం
కోసం పలు పథకాలు అమలు చేస్తున్నామని, అన్ని రకాల వైద్య సేవలను
అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా సీఎం అన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన
డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో మొత్తం 57 రకాల వైద్య పరీక్షలు
ఉచితంగా నిర్వహిస్తారని వెల్లడించారు. సీఎం ఆదేశాల మేరకు.. మహబూబాబాద్, భద్రాద్రి, జగిత్యాల, సిద్దిపేట,
నల్గొండ, ఖమ్మం, సిరిసిల్ల,
వికారాబాద్, నిర్మల్, కరీంనగర్,
ఆదిలాబాద్, గద్వాల్, ఆసిఫాబాద్
జిల్లా కేంద్రాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన
డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో సేవలు సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి.
0 Komentar