TS: విద్యాశాఖ అధికారులు మరియు ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు గౌరవ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారి సూచనలు
ఈరోజు గౌరవ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మేడం గారు జూమ్ మాధ్యమం ద్వారా సూచించిన ఆదేశాల మేరకు క్రింది సూచనలు మీరు తప్పక పాటించుటకు అదేశించనైనది.
1. మూడవ వ తరగతి నుండి పదవ తరగతి
చదువుతున్న విద్యార్థులకు త్వరలో ఆన్ లైన్ విద్యాబోధన ప్రారంభం కానున్నందున మీ
పాఠశాల లోని అందరు విద్యార్థులకు తగు సమాచారం ఇచ్చి వారికి అందుబాటులో ఉన్న
మాధ్యమాల ద్వారా ఆన్ లైన్ తరగతులకు హాజరు అగునట్లు సంసిద్ధులను చేయగలరు.
2. పాఠశాల లో చదివే ప్రతి విద్యార్థి
తప్పనిసరిగా తన మొబైల్ ఫోన్ లో TSAT APP డౌన్లోడ్ చేయించి
ఆన్ లైన్ తరగతులు హాజరు అయ్యే విధానo పై తగు మార్గదర్శనం
చేయగలరు.
3. ప్రతి విద్యార్థికి సంబంధించిన మొబైల్ నంబర్,
TSAT APP డౌన్లోడ్ వివరాల సమాచారం మేము త్వరలో పంపబోయే నివేదిక సమర్పించడానికి
సిద్ధంగా ఉంచుకోగలరు.
4. విద్యార్థులను మీ
పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులతో గ్రూప్ లుగా విభజించి ఆన్ లైన్ తరగతుల పర్యవేక్షణ
కు తగిన ప్రణాళిక రూపొందించుకోగలరు. రోజు వారీ పర్యవేక్షణ కు సంబంధించి రికార్డ్
మైంటైన్ చేయగలరు.
0 Komentar